- స్త్రీశక్తి, తల్లికి వందనంతో మేలు
- క్షేత్రస్తాయిలో ప్రతిఇంటికి వెళ్లి వివరించాలి
- మండలి విప్, ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు
- మండల స్థాయి క్యాడర్‌కు శిక్షణ ప్రారంభం
మంగళగిరి(చైతన్యరథం): టీడీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ మండల స్థాయి క్యాడర్ 5వ బ్యాచ్ శిక్షణ తరగతులు గురువారం ప్రారంభమయ్యాయి. ప్రభుత్వ విప్, టీడీపీ మానవ వనరుల విభా గం చైర్మన్ వేపాడ చిరంజీవిరావు మాట్లాడుతూ శిక్షణ తరగతుల ద్వారా పార్టీ భావజాలం, సిద్ధాంతాలను కూలంకషంగా అర్థం చేసుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యంలో అమలు చేస్తున్న ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలపై పూర్తిస్థాయి అవగాహన పెంచుకోవాలని చెప్పారు. ఈ శిక్షణ తరగతులు అత్యంత ఉత్సా హంగా సాగాయి. కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘తల్లికి వందనం’, ‘స్త్రీ శక్తి’ పథకాలపై ప్రభుత్వ విప్ చిరంజీవిరావు ప్రత్యేకంగా శిక్షణ అందించారు. క్యాడర్‌కు సీడాప్ చైర్మన్ జి.దీపక్‌రెడ్డి, మాజీ మంత్రి నెట్టెం రఘురామ్, కనిగిరి ఎమ్మెల్యే ఉగ్రనరసింహారెడ్డి వివిధ అంశాలపై శిక్షణ అందించారు. అనంత రం వారికి ప్రభుత్వ విప్ వేపాడ జ్ఞాపికలు అందజేశారు. ఈ సందర్భంగా చిరంజీవిరావు మాట్లాడుతూ ప్రతి విద్యార్థి చదువుకు అండగా నిలిచేందుకు ప్రభుత్వం ‘తల్లికి వందనం’ పథకాన్ని తీసు కువచ్చిందని, దీని ద్వారా కలిగే ప్రయోజనాలను క్షేత్రస్థాయిలోని ప్రతి ఇంటికి వివరించాలని క్యాడర్‌కు సూచించారు. అలాగే, మహిళల ఆర్థిక సాధికారత, భద్రతే లక్ష్యంగా ‘స్త్రీ శక్తి’ పథకాన్ని రూపొందించినట్లు పేర్కొన్నారు. మహిళా సాధికారత ద్వారానే సమాజం అభివృద్ధి చెందుతుందని, ఈ దిశగా చంద్రబాబు ప్రభు త్వం తీసుకుంటున్న చర్యలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపుని చ్చారు. ఈ శిక్షణలో రాష్ట్రంలోని వివిధ మండలాల నుంచి మండ ల పార్టీ అధ్యక్షులు, జనరల్ సెక్రటరీలు పాల్గొన్నారు.










