- ఏర్పాటు చేయాలని సెలెస్టా విసి సంస్థ ప్రతినిధులకు మంత్రి లోకేష్ వినతి
- సంస్థ మేనేజింగ్ పార్టనర్ అరుణ్ కుమార్‌తో మంత్రి భేటీ
శాన్‌ఫ్రాన్సిస్కో/యూఎస్‌ఏ (చైతన్యరథం): ఆంధ్రప్రదేశ్‌లో సెలెస్టా క్యాపిటల్ డీప్ టెక్ ఇన్నొవేషన్ హబ్ ఏర్పాటు చేయాలని అంతర్జాతీయస్థాయి వెంచర్ క్యాపిటల్ సంస్థ సెలెస్టా విసి (జవశ్రీవర్a పజ) మేనేజింగ్ పార్టనర్ అరుణ్ కుమార్‌ను రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ కోరారు. అమెరికా పర్యటనలో ఉన్న మంత్రి లోకేష్ శాన్‌ఫ్రాన్సిస్కోలో అరుణ్ కుమార్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ… ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం పెట్టుబడులకు పూర్తి అనుకూల వాతావరణం నెలకొని ఉందన్నారు. విశాఖనగరం ఐటీి, డేటా హబ్ గా శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో సెలెస్టా క్యాపిటల్ డీప్ టెక్ ఇన్నొవేషన్ హబ్ ఏర్పాటు చేయండి. సెమీ కండక్టర్, ఏఐ, క్వాంటమ్ కంప్యూటింగ్ రంగాల్లో పెట్టుబడులు పెట్టండి. కంపెనీలకు ఏపీ ప్రభుత్వం దేశంలోనే అత్యుత్తమైన సమగ్ర ప్రోత్సాహకాలను అందిస్తోంది. పరిశ్రమలకు నిర్ణీత సమయంలో నేరుగా ప్రోత్సాహకాలను అందించేందుకు దేశంలోనే తొలిసారిగా ఎస్క్రో ఖాతా విధానాన్ని ప్రారంభించనునట్లు చెప్పారు. మంత్రి లోకేష్ వినతిపై సెలెస్టా విసి మేనేజింగ్ పార్టనర్ అరుణ్ కుమార్ స్పందిస్తూ… తాము ప్రధానంగా యూఎస్, ఇండియా, ఇజ్రాయెల్, ఆగ్నేయాసియా దేశాలపై దృష్టి సారిస్తున్నట్లు చెప్పారు. సెమీకండక్టర్లు, AI/వీూ, రోబోటిక్స్, క్వాంటం కంప్యూటింగ్ వంటి డీప్ టెక్ రంగాలు, సాస్, సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లాంటి ఎంటర్‌ప్రైజింగ్ సాఫ్ట్ వేర్, గ్లోబల్ మార్కెట్‌లను అనుసంధానించే స్టార్టప్‌ల్లో పెట్టుబడులకు ప్రస్తుతం తాము ప్రాధాన్యతనిస్తున్నట్లు చెప్పారు. ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలను పరిశీలిస్తామని అరుణ్ కుమార్ చెప్పారు.












