- 6నుంచి 10వరకు అమెరికా, కెనడా టూర్
- ఏపీకి పెట్టుబడుల సాధనే లక్ష్యం
అమరావతి (చైతన్య రథం): రాష్ట్రానికి పెట్టుబడుల సాధనే లక్ష్యంగా రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ మంత్రి నారా లోకేష్ ఈనెల 6నుంచి 10 వరకు 5 రోజులపాటు అమెరికా, కెనడా దేశాల్లో పర్యటించనున్నారు. 6న తొలిరోజు డల్లాస్‌లో తెలుగు డయాస్పోరా సమావేశంలో పాల్గొంటారు. 8, 9 తేదీల్లో శాన్‌ఫ్రాన్సిస్కో వేదికగా పలు కంపెనీల ప్రతినిధులతో సమావేశమవుతారు. 10న కెనడాలోని టొరంటోలో పర్యటిస్తారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మంత్రి లోకేష్ అమెరికాలో పర్యటించడం ఇది రెండోసారి. పెట్టుబడుల సాధనకు గత 18నెలల్లో మంత్రి లోకేష్ అమెరికా, దావోస్, సింగపూర్, ఆస్ట్రేలియా దేశాల్లో పర్యటించారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బ్రాండ్, రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకుగల అనుకూలతలను వివరిస్తూ ఇప్పటివరకు మంత్రి లోకేష్ చేసిన పర్యటనలతో ఇటీవల విశాఖలో జరిగిన పార్టనర్ షిప్ సమ్మిట్‌లో ఏపీకి భారీగా పెట్టుబడులు పోటెత్తాయి.












