అమరావతి (చైతన్య రథం): 2030లో జరిగే శతాబ్ది కామన్వెల్త్ క్రీడలకు ఆతిథ్యం ఇచ్చే బిడ్‌ను భారతదేశం దక్కించుకోవడం ప్రతి పౌరుడికి ఎంతో గర్వకారణమని సీఎం చంద్రబాబు నాయుడు ఆనందం వ్యక్తం చేశారు. ఎక్స్ వేదికగా పోస్టు పెడుతూ.. ‘‘ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో ఈ విజయం ఒక ప్రత్యేక మైలురాయిగా నిలుస్తుంది. ప్రపంచ వేదికపై భారతదేశం యొక్క స్థానాన్ని మరింత పెంచుతుంది. క్రీడా నైపుణ్యంపట్ల భారత్ యొక్క బలమైన నిబద్ధతను ప్రతిబింబిస్తుంది’’ అని పేర్కొన్నారు.











