- సమస్యల పరిష్కారానికి మంత్రి లోకేష్ చొరవ
- టీడీపీ కేంద్ర కార్యాలయంలో 75వ రోజు ప్రజాదర్బార్
- పెద్దఎత్తున తరలివచ్చిన ప్రజలు, పార్టీ కార్యకర్తలు
- స్వయంగా కలిసి అర్జీలు స్వీకరించిన మంత్రి లోకేష్
- అందరినీ ఆదుకుంటామని భరోసా
అమరావతి (చైతన్యరథం): ఇబ్బందులు పరిష్కరించి అండగా ఉంటామని రాష్ట్రవ్యాప్తంగా వివిధ సమస్యలపై తరలి వచ్చిన ప్రజలకు విద్య, ఐటీశాఖల మంత్రి నారా లోకేష్ హామీ ఇచ్చారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి నారా లోకేష్ మంగళవారం 75వ రోజు ప్రజాదర్బార్ నిర్వహించారు. మంత్రి లోకేష్‌ను కలిసి స్వయంగా సమస్యలు విన్నవించేందుకు ప్రజలు, కార్యకర్తలు పెద్దఎత్తున తరలివచ్చారు. ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించిన మంత్రి లోకేష్.. వివిధ సమస్యలతో బాధపడుతున్న వారి నుంచి వినతులు స్వీకరించారు. పలు సమస్యల త్వరితగతిన పరిష్కారానికి సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు.
ఇంటిని కూల్చారు, న్యాయం చేయండి
టీడీపీ సానుభూతిపరుడిననే కక్షతో గత వైసీపీ ప్రభుత్వ పాలనలో తనపై అక్రమ కేసులు బనాయించి కుటుంబాన్ని క్షోభకు గురిచేశారని, విచారించి కేసుల ఎత్తివేతకు చర్యలు తీసుకోవడంతో పాటు ఆర్థికసాయం అందించి ఆదుకోవాలని శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లకు చెందిన జరుగుళ్ల గురుమూర్తి.. మంత్రి నారా లోకేష్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు.
పీజీ చదివిన తనకు ఉద్యోగ అవకాశం కల్పించి ఆదుకోవాలని కర్నూలు జిల్లా శిరివెళ్ల మండలం గోవిందపల్లెకు చెందిన పగిడి వెంకటలక్ష్మి కోరారు.
గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కురగల్లులోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో 70 మంది కలిసి పొదుపు చేసిన రూ.7.55 కోట్ల నగదును సీఈవో దుర్వినియోగం చేశారని, విచారించి తగిన చర్యలు తీసుకోవాలని సంఘ సభ్యులు విన్నవించారు.
గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం పెద్దవడ్లపూడిలో తమ 0.39 ఎకరాల వ్యవసాయ భూమిని వెబ్ ల్యాండ్‌లో నమోదుకు తగిన చర్యలు తీసుకోవాలని గ్రామానికి చెందిన కుర్రా వెంకట్రావు విజ్ఞప్తి చేశారు.
రాష్ట్రంలో రిటైర్డ్ పార్ట్ టైం ప్రభుత్వ ఉద్యోగులకు ప్రస్తుతం చెల్లిస్తున్న రూ.4వేల పెన్షన్‌ను రూ.10వేలకు పెంచాలని ఏపీ రిటైర్డ్ పార్ట్ టైం వీఏవో, పీటీఏ, వీఆర్వోస్ ఫెడరేషన్ ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు.
అనారోగ్యంతో బాధపడుతున్న తమ కుమారుడి వైద్య చికిత్సకు సీఎంఆర్‌ఎఫ్ ద్వారా ఆర్థికసాయం అందించి ఆదుకోవాలని విజయనగరం జిల్లా గరుగుబిల్లి మండలం ఉద్దవోలు గ్రామానికి చెందిన వి.నాగభూషణం కోరారు.
దివ్యాంగురాలినైన తాను జీవోనోపాధి కోసం ఓ ప్రైవేటు పాఠశాలలలో టీచర్‌గా పనిచేస్తున్నాననని, దైనందిన జీవితం కోసం ట్రై స్కూటీ అందజేసి ఆదుకోవాలని పల్నాడు జిల్లా దాచేపల్లికి చెందిన షేక్ సుభాన్ బీ విజ్ఞప్తి చేశారు.
పూర్తి అంగవైకల్యంతో బాధపడుతున్న తనకు రూ.15వేల పెన్షన్ అందించి అండగా నిలవాలని అనంతపురం జిల్లా గుత్తి పట్టణానికి చెందిన వై.మహాలక్ష్మి విన్నవించారు.
ఆయా విజ్ఞప్తులను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి లోకేష్ హామీ ఇచ్చారు.












