అమరావతి (చైతన్యరథం): అంధుల మహిళా టీ20 వరల్డ్ కప్‌లో భారత్ గెలుపుపై క్రీడాశాఖ మంత్రి మండిపల్లి మంత్రి రాంప్రసాద్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఫైనల్‌లో నేపాల్‌పై అద్భుత విజయంతో జయకేతనం ఎగురవేసిన టీం ఇండియాకు అభినందనలు తెలిపారు. మహిళల అసాధారణ ప్రతిభ దేశానికి గర్వకారణం నిలిచింది. ప్రతికూలతలను జయించి చరిత్ర సృష్టించిన భారత మహిళా జట్టు పోరాట పటిమ, సామర్థ్యం అందరికి ఆదర్శం. క్రీడల్లో సమాన అవకాశాలు కల్పించే దిశగా ప్రభుత్వం కట్టుబడి ఉంది. అంధుల మహిళల టీ20 ప్రపంచ కప్ విజయం యువతకు స్ఫూర్తి. క్రీడల్లో దేశ ఖ్యాతిని ప్రపంచానికి చాటారు. రాష్ట్ర ప్రభుత్వం పారా గేమ్స్‌తో పాటు అంధుల, బధిరుల క్రీడలను మరింత ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకుంటుందని మంత్రి తెలిపారు.
అంధ మహిళల వరల్డ్‌కప్ విజయం..గర్వకారణం – మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి
అంధుల మహిళా టీ20 వరల్డ్ కప్ సాధించిన భారత జట్టుకు రాష్ట్ర దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అభినందనలు తెలిపారు. ఫైనల్‌లో నేపాల్‌పై అద్భుత విజయం సాధించిన భారత జట్టుకు శుభాకాంక్షలు. జట్టు సభ్యుల సమష్టి కృషి, అకుంఠిత దీక్ష, పట్టుదలతో విజయం సాధించారు. ఈ మ్యాచ్ లో 42 పరుగులతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన విశాఖలోని ప్రభుత్వ బాలికల అంధుల రెసిడెన్షియల్ పాఠశాల 10వ తరగతి విద్యార్థిని పంగి కరుణ కుమారికి మనస్ఫూర్తిగా ప్రత్యేక అభినందనలు. కరుణ కుమారికి సహకరించిన పాఠశాల సిబ్బందిని అభినందిస్తున్నా. కరుణ కుమారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున క్రికెట్లో ప్రత్యేక శిక్షణ ఇప్పించి అన్ని విధాల ప్రోత్సహించాం. ఈ మ్యాచ్‌లో కరుణకుమారి చూపిన ప్రతిభ రాష్ట్రానికే గర్వకారణం. విభిన్న ప్రతిభావంతుల ప్రతిభను గుర్తించి వారికి అన్ని విధాల కూటమి ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తుందనేదానికి ఇదే నిదర్శమని మంత్రి డా. స్వామి అన్నారు.
చారిత్రాత్మక విజయం: శాప్ చైర్మన్
అమరావతి (చైతన్యరథం): అంధ మహిళల టీ 20 ప్రపంచకప్ ఫైనల్లో భారత జట్టు చారిత్రాత్మక విజయం సాధించటం పట్ల స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (శాప్) చైర్మన్ అనిమిని రవినాయుడు హర్షం వ్యక్తం చేశారు. ఫైనల్‌లో నేపాల్‌పై ఘన విజయం సాధించిన మహిళా జట్టుకు శుభాకాంక్షలు తెలిపారు. విజయానికి కీలకమైన పరుగులు చేసిన మన తెలుగు తేజం పి. కరుణకుమారికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. పారా క్రీడాకారులను రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది, కరుణ కుమారికి క్రీడా ప్రోత్సాహక నగదును ఇచ్చి ప్రోత్సహిస్తామని రవినాయుడు తెలిపారు.












