అమరావతి (చైతన్యరథం): ఆటపాటలతో అలరిస్తూ విద్యార్థులకు తేలికగా అర్థమయ్యేలా ఇంగ్లీష్, లెక్కల సబ్జెక్టులను బోధిస్తున్న ఉపాధ్యాయురాలని విద్య, ఐటీశాఖల మంత్రి నారా లోకేష్‌కు అభినందించారు. అనంతపురం జిల్లా, గుమ్మఘట్ట మండలం, పైదొడ్డి గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో సెకండరీ గ్రేడ్ టీచర్‌గా పనిచేస్తున్న బుకెరామిరెడ్డిపల్లి కౌసల్య బోధనా పద్ధతిపై విద్య, ఐటీశాఖల మంత్రి నారా లోకేష్ ప్రశంసలు కురిపించారు. విద్యార్థులలో ఒకరిగా మారి ఆటపాటలతో అలరిస్తూ.. సామెతలు, సూక్తులతో పాఠాలు బోధిస్తున్న కౌసల్య టీచర్‌కు అభినందనలు తెలిపారు. ‘‘English made easy, Lets learn with techniques ’’ అనే విధానంలో విద్యార్థులకు ఇంగ్లీష్, మ్యాథ్స్ సులువుగా నేర్పించడం ప్రశంసనీయం. సోషల్ మీడియా వేదికగా మీరు చేస్తున్న ఎడ్యుటైన్‌మెంట్ కంటెంట్ చాలా బాగుంది మేడమ్ అని ఎక్స్ వేదికగా మంత్రి లోకేష్ అభినందనలు తెలియజేశారు.













