- ఆపన్నులకు మంత్రి లోకేష్ భరోసా
- పుట్టపర్తిలో మంత్రి 74వ రోజు ప్రజాదర్బార్
- ప్రతి ఒక్కరిని స్వయంగా కలిసి విజ్ఞప్తులు స్వీకరించిన మంత్రి
- సమస్యలు పరిష్కరించి అండగా ఉంటామని హామీ
పుట్టపర్తి (చైతన్యరథం): విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పుట్టపర్తిలోని తన క్యాంప్ సైట్ లో ఆదివారం ఉదయం 74వ రోజు ప్రజాదర్బార్ నిర్వహించారు. మంత్రి లోకేష్‌ను కలిసేందుకు సామాన్య ప్రజలు, టీడీపీ కార్యకర్తలు తరలివచ్చారు. ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరించిన మంత్రి నారా లోకేష్… ఆయా సమస్యలపై వారి నుంచి వినతులు స్వీకరించారు. వైసీపీ హయాంలో అప్పటి ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ప్రోద్బలంతో తనపై అక్రమ కేసులు నమోదు చేసి ఇబ్బందులకు గురిచేశారని, విచారించి అక్రమ కేసుల ఎత్తివేతకు చర్యలు తీసుకోవాలని శ్రీసత్యసాయి జిల్లా ముదిగుబ్బ మండలం మలకవేముల గ్రామానికి చెందిన డి.లోకేష్ విజ్ఞప్తి చేశారు. భవన నిర్మాణ కార్మికుడిగా జీవనం సాగిస్తున్న తాను.. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నానని, సాయం అందించి అండగా నిలవాలని బుక్కపట్నంకు చెందిన గాజుల రామాంజనేయులు విన్నవించారు.
సత్యసాయి జిల్లా చెన్నేకొత్తపల్లి గ్రామంలో తాను కొనుగోలు చేసిన రెండున్నర సెంట్ల ఇంటి స్థలాన్ని గత వైసీపీ ప్రభుత్వ అండతో హనుమంతరెడ్డి ఆక్రమించారని, విచారణ జరిపి తగిన న్యాయం చేయాలని ముదిగుబ్బ మండలం మాకర్లకుంటపల్లికి చెందిన టి.నాగభూషణం విజ్ఞప్తి చేశారు. ఎంఏ బీఈడీ చదివిన తనకు శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలోని ఎండోమెంట్ కార్యాలయంలో ఉద్యోగ అవకాశం కల్పించాలని పుట్టపర్తికి చెందిన ఎన్.జయలక్ష్మి విజ్ఞప్తి చేశారు. ఆయా వినతులను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి భరోసా ఇచ్చారు.
““











