- లోక కళ్యాణం కోసం నిరంతరం తపించారు
- జాతి నిర్మాణం కోసం పనిచేస్తున్న సత్యసాయి సెంట్రల్ ట్రస్టు
- సత్యసాయి బాబా శతజయంతి ఉత్సవాల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
పుట్టపర్తి (చైతన్యరథం): విశ్వప్రేమకు ప్రతిరూపంగా సత్యసాయి జీవించారని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. సత్యం, మంచి వ్యక్తిత్వం, శాంతి, ప్రేమను పాటించాలని సత్యసాయి బాబా -నిరంతరం బోధించేవారని, లోక కళ్యాణం కోసం -బాబా పని చేశారని కొనియాడారు. సత్యసాయి సెంట్రల్ ట్రస్టు జాతి నిర్మాణం కోసం పని చేస్తోందని -తెలిపారు. శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తిలో జరుగు -తోన్న సత్యసాయి బాబా శతజయంతి ఉత్సవాలకు శనివారం ఆమె హాజరయ్యారు. అంతకు ముందు -పుట్టపర్తి విమానాశ్రయానికి చేరుకున్న రాష్ట్రపతికి సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్, అధికారులు స్వా తం పలికారు. అనంతరం సత్యసాయి బాబా మహా సమాధిని దర్శించుకుని వేడుకల్లో పాల్గొన్నారు. ఈ. సందర్భంగా రాష్ట్రపతి ముర్ము మాట్లాడుతూ సత్య సాయి బాబా జయంతి ఉత్సవాల్లో పాల్గొనడం తన మహాద్భాగ్యం అన్నారు. మానన సేవే మాధవ సేవ-అని బాబా భావించేవారు.
సమాజానికి సేవలందిం చిన మహానుభావుల్లో సత్యసాయి బాబా అగ్రభాగాన ఉన్నారు. చాలామంది సత్యసాయి భక్తులు దేశ, విదే శాల్లో ఉన్న పేద వారికి సేవలందిస్తోన్నారు. 1969 నుంచే మహిళల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు. నేషన్ ఫస్ట్ అనే విధానంలో సత్యసాయి వాబా సేవలందించారు. దీన్ని అందరూ పాటించాలి. వాబా శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఆయన స్పూర్తితో పని చేస్తామని సంకల్పం తీసుకోవాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పిలుపు ఇచ్చారు. అంతకు ముందు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్తో కలిసి సత్యసాయిమహాసమాధిని రాష్ట్రపతి దర్శించుకున్నారు.














