- కష్టపడితే విజయం మీ సొంతమవుతుంది
- విజన్ తో ముందుకెళితే అద్భుతాలు సృష్టించవచ్చు
- విద్యార్థులకు నారా భువనేశ్వరి ఉద్బోధ
- 2వ రోజు కుప్పం పర్యటనలో కేజీబీవీ, గురుకుల పాఠశాల సందర్శన
- 20 కంప్యూటర్లు, నర్సింగ్ విద్యార్థులకు అవసరమైన పరికరాలు అందిస్తామని హామీ
- విద్యార్థులతో కలిసి భోజనం, ఆటోలో ప్రయాణించిన భువనమ్మ
కుప్పం (చైతన్యరథం): క్రమశిక్షణ, పట్టుదల ఉంటే విజయం మన సొంతమవుతుందని ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి ఉద్బోధించారు. దేశ భవిష్యత్ విద్యార్థుల చేతిలోనే. ఉందన్నారు. పిల్లల పెంపకంలో తల్లి పాత్ర కీలక మైందని, చిన్నతనం నుంచే పిల్లలకు విలువలు నేర్పిం చాలన్నారు. కుప్పం నియోజకవర్గ పర్యటనలో భాగం గాలో రెండోరోజు గురువారం పరమసముద్రం గ్రామంలో నారా భువనేశ్వరి పర్యటించారు. కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల (కేజీబీవీ), గురుకుల పాఠ శాలలను సందర్శించారు. కస్తూర్బా పాఠశాల నుంచి గురుకుల పాఠశాలకు విద్యార్థులతో కలిసి ఆటోలో ప్రయాణించారు. అనంతరం సామగుట్ట పల్లిలో విలువల బడి కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతకు ముందు కస్తూర్బా పాఠశాలలో విద్యార్థులతో ముఖా ముఖిలో పాల్గొని వారితో కలిసి భోజనం చేశారు. విద్యార్థులను ఉద్దేశించి భువనేశ్వరి మాట్లాడారు.
విజయానికి షార్ట్కట్ లేదు
పిల్లల భవిష్యత్ బాగుండాలని తల్లిదండ్రులు ఎంతో కష్టపడి చదివిస్తారు. వారి నమ్మకాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత మీపై ఉంది. ఆటపాటతో పాటు కెరీర్ పైనా విద్యార్థులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. కష్టపడకుండా విజయం రాదు. విద్యార్థి దశ నుంచే లక్ష్యంతో ముందుకెళితే అద్భుతాలు సృష్టించవచ్చు. ఎన్టీఆర్, అబ్దుల్ కలామ్, ధీరూభాయ్ అంబానీ, చంద్రబాబు వంటి వారంతా ఎంతో కష్టపడి ఉన్నత స్థానాలకు చేరుకున్నారు. చంద్రబాబు చిన్నతనంలో కిలోమీటర్లు నడిచి స్కూల్కు వెళ్ళేవారు. నాకు తల్లి దండ్రులే స్ఫూర్తి. మా నాన్న ఎంతో కష్టపడి పైకి వచ్చారు. చిన్న వయసులో ఇంటింటికీ వెళ్లి పాలు అమ్మేవారు. ఆ తర్వాత స్కూల్కి వెళ్లి చదువుకునే వారు. ఎంతోమంది తల్లిదండ్రులు స్థోమత లేక పోయినా వారి శక్తికి మించి పిల్లలను చదివిస్తున్నారు.
వారు మీపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని విద్యార్థులకు నారా భువనేశ్వరి సూచించారు. అలాగే విద్యార్థులు చదువుతో పాటు క్రీడలపైనా దృష్టి పెట్టా లని, క్రీడల్లో రాణించే విద్యార్థులకు సహాయం చేయ టానికి ఎన్టీఆర్ ట్రస్ట్ ఎప్పుడు ముందుంటుందన్నారు. కస్తూర్బా విద్యాలయానికి 20 కంప్యూటర్లు, సర్సింగ్ విద్యార్థులకు అవసరమైన పరికరాలు అందేలా ఏర్పాట్లు చేస్తామని భువనేశ్వరి హామీ ఇచ్చారు.
పిల్లలను విలువలతో పెంచాలి
విలువల బడి వ్యవస్థాపకులు లెనిల్ని నేను మనస్పూర్తిగా అభినందిస్తున్నాను. విద్యార్థులకు విద్యతో పాటు నైతిక విలువలు, సామాజిక బాధ్యత నేర్పించి బాధ్యత కలిగిన పౌరులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఈ బడులను ఏర్పాటు చేయడం గొప్ప విషయం. నా చిన్నతనంలో స్కూల్లో మోరల్ సైన్స్ ఒక సబ్జెక్ట్ ఉండేది. ఇప్పుడు మళ్లీ పాఠశాలల్లో ఆ సబ్జెక్ట్ తీసుకొచ్చిన మంత్రి నారా లోకేష్కు నా అభినందనలు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు క్లోజ్ అనే బోర్డులు పెట్టడం చాలా సంతోషదాయకం. నేటి సమాజంలో విలువలు తగ్గిపోతున్నాయి. టెక్నాలజీని చెడు కోసం ఉపయోగిస్తున్నారు. పిల్లల పెంపకంలో తల్లుల పాత్ర కీలకమైంది. చిన్నతనంలోనే విలువలు, సంస్కారం నేర్పాలి. పిల్లల ఆసక్తి గమనించి అందులో. రాణించేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలి. నారా లోకేష్ ప్రజాసేవలో బిజీగా ఉండటంలో మా మనుమడు దేవాన్షి చదువు, క్రీడల విషయాలు బ్రాహ్మణినే స్వయంగా చూసుకుంటుంది. అప్పట్లో చంద్రబాబు రాజకీయాల్లో బిజీగా ఉండటంతో లోకేష్ పెంపకం బాధ్యత తానే తీసుకున్నానని నారా భువనేశ్వరి తెలిపారు.












