పుట్టపర్తి (చైతన్యరథం): భగవాన్ సత్య సాయిబాబా సెంటినరీ ఉత్సవాల్లో పాల్గొనేందుకు శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తి చేరుకున్న ప్రముఖ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ను రాష్ట్ర విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ మంగళవారం మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. సచిన్ ను కలిసిన వారిలో రాష్ట్ర మంత్రులు పయ్యావుల కేశవ్, అనగాని సత్యప్రసాద్ ఉన్నారు.











