- వారి అభివృద్ధికి బాటలు వేస్తాం
- సీఐఐ సదస్సులో మంత్రి గుమ్మిడి సంధ్యారాణి
విశాఖపట్టణం(చైతన్యరథం): లక్ష మంది మహిళా వ్యాపార వేత్తలే లక్ష్యంగా పనిచేస్తున్నామని స్త్రీ, శిశు సంక్షేమ మంత్రి మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. విశాఖపట్టణం సీఐఐ సమ్మిట్‌లో లింగ సమానత్వ స్పందన: సమగ్ర భవిష్యత్‌ను నిర్మిస్తున్నాం (GenderResponsive Inno vatio n: Building Inclusive Futures) అనే అం శంపై చర్చా గోష్ఠిలో మంత్రి మాట్లాడారు. దేశంలోని అన్ని రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ వైపు చూసేలా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర్రాన్ని అభివృద్ధి చేస్తున్నారన్నారు. మహిళాభివృద్ధికి ముఖ్యమం త్రి ఎంతో కృషి చేస్తున్నారన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు వరదలా వస్తున్నాయంటే అందుకు ముఖ్యమంత్రిపై ఉన్న నమ్మకమేన న్నారు. ఆయన లీడర్ షిప్‌లో పనిచేస్తున్నాం కాబట్టే మాకు ఎంతో గౌరవం ఉందన్నారు. లక్ష ఎకరాల్లో కాఫీ పంట పండిస్తున్నారని, కాఫీని ప్యాక్ చేయడం వల్ల మహిళలకు ఆదాయం వస్తుందని, అది మహిళలకు ముఖ్యమంత్రి అందిస్తున్న ఆదాయ మార్గమ న్నారు. విశాఖకు గూగుల్ సంస్థ వస్తుందంటే పక్క రాష్ట్రాలు ఎంతో ఇబ్బంది పడ్డాయని అయినా ముఖ్యమంత్రి, మంత్రి నారా లోకేష్‌లు ఎంతో పట్టుదలగా వ్యవహరించి రాష్ట్రానికి తీసుకొచ్చార న్నారు. గతంలో రాష్ట్రం పేరు చెపితే పరుగెత్తిన సంస్థలు ఇప్పుడు రాష్ట్రానికి తిరిగి వస్తున్నాయని అందుకు ముఖ్యమంత్రి పాలనే కారణం అని కొనియాడారు. భవిష్యత్ తరాలు బాగుండాలని వారి అభివృద్ధి సంక్షేమానికి ముఖ్యమంత్రి కంకణబద్దులై పనిచేస్తున్నా రన్నారు. నేను వెనుకబడిన ప్రాంతానికి చెందిన మహిళగా నేను చెపుతున్నానని మహిళాభివృద్ధికి చెందిన ప్రభు త్వంగా, ఒక మంచి ప్రభుత్వంగా పనిచేస్తున్నామన్నారు. మహిళాభివృద్ధికి ముఖ్యమంత్రి నాయకత్వంలోని ప్రభుత్వం మహిళావృద్ధికి అనేక చర్యలు తీసుకుంటుందని, రాష్ట్రంలో అందరు మహిళలు స్వేచ్ఛగా, సంతోషంగా, సేఫ్టీగా ఉండాలని పనిచేస్తుందన్నారు.
ఇన్నోవేషన్ పాలసీపై అవగాహనతో వెళ్లాలి
మహిళా కమిషన్ చైర్మన్ రాయపాటి శైలజ మాట్లాడుతూ మేము మహిళల హక్కుల కోసం అంకితభావంతో పనిచేస్తా మన్నారు. మహిళల సమస్యలపై ప్రభుత్వానికి సలహాదారులుగా కూడా ఉంటామన్నారు. ఇన్నోవేషన్ పాలసీలపై మహిళలు అవగాహనతో ముందుకెళ్లాలన్నారు. డిజిటల్ గవర్ననెన్స్‌ను ఆక ళింపు చేసుకుని ముందుకెళ్లాలన్నారు. ఏపీ మహిళా పక్షపాత ప్రభుత్వం అన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి చెందిన మహిళా శక్తిని తయారు చేస్తున్నామన్నారు. లింగ వివక్ష పోవాలంటే పట్టణాలు, గ్రామాల్లో అనే క్యాంపులు పని మహిళల్లో చైతన్యం తీసుకురావా లన్నారు. మహిళలకు ఆన్‌లైన్ సేఫ్టీ, అక్షరాస్యత పెంచడం, మహిళలపై దాడులను అరికట్టే విధంగా ప్రభుత్వాలు పనితీరు మెరుగ్గా అభిప్రాయపడ్డారు. అప్పుడే మహిళల సాధికా రత సాధ్యమౌవడానికి ఈ చర్యలు దోహదపడతాయన్నారు. షారన్ బ్యూటుయో మాట్లాడుతూ మహిళలు ముఖ్యంగా నైపు ణ్యం లేదా అవగాహన లేదా సామర్థ్యాన్ని పెంపొందించుకో వాలన్నా రు. డిజిటల్ సాధనాలను స్వీకరించడానికి వారిని బాగా సన్నద్ధం చేయాలని తెలిపారు. మిహీలా జోరిచ్వో మాట్లాడుతూ సాంకేతిక విద్య మహిళల జీవితాల్లో మార్పును తీసుకొస్తుంద న్నారు. చర్చా గోష్ఠికి మోడరేటర్‌గా సీఐఐ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.మురళీకృష్ణ వ్యవహరించారు.













