- పరిశ్రమల అభివృద్ధికి బాటలు వేస్తున్న ప్రభుత్వం
- విశాఖపట్నంలో సీఐఐ సదస్సు విజయవంతం
- పెట్టుబడిదారుల విశ్వాసానికి కొత్త ఊపిరి
- వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు
విశాఖపట్నం(చైతన్యరథం): వ్యవసాయ బలోపేతం ద్వారానే పారిశ్రామిక రంగం అభివృద్ధి సాధ్యమవుతుందని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. విశాఖపట్నం లో జరిగిన కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ (సీఐఐ) భాగస్వామ్య సదస్సులో మాట్లాడుతూ రాష్ట్ర జీఎస్‌డీపీలో 35 శాతం ప్రాథమిక రంగం నుంచే వస్తుందనడం ద్వారా వ్యవసాయ ప్రాధాన్యతకు మరోసారి నిదర్శనం లభించిందని చెప్పారు. వ్యవ సాయ రంగంలో జరుగుతున్న విప్లవాత్మక మార్పులతో ఆంధ్ర ప్రదేశ్ దేశానికి మార్గదర్శకంగా నిలుస్తోంది. ఫామ్ మెకనైజేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డ్రోన్ల వినియోగం రైతుల ఖర్చులను భారీగా తగ్గించి లాభదాయకతను పెంచుతోందని వివరించారు. రసాయనాలు లేని సహజ వ్యవసాయ ఉత్పత్తులకు గల డిమాండ్ పెరుగుతుండటంతో, సహజ వ్యవసాయాన్ని మరింతగా ప్రోత్స హించాల్సిన అవసరం ఉందన్నారు. తొమ్మిదేళ్ల క్రితం ముందు చూపుతో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రవేశపెట్టిన న్యాచురల్ ఫార్మింగ్ నేడు ఆంధ్రప్రదేశ్‌కు ప్రపంచవ్యాప్త గుర్తింపు తెచ్చిందని గుర్తుచేశారు. వ్యవసాయ రంగంలో పెట్టుబడి ఖర్చులు తగ్గించ డం, మార్కెటింగ్ సదుపాయాలు మెరుగుపరచడం తమ ప్రధాన లక్ష్యాల్లో ఒకటిగా ఉందని మంత్రి పేర్కొన్నారు. రైతుల ఆదాయా న్ని పెంచడంలో కీలక పాత్ర పోషించే ఫుడ్ ప్రాసెసింగ్ రంగానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తున్నట్లు తెలిపారు.
సీఐఐ సదస్సు పెట్టుబడుల ప్రవాహానికి శ్రీకారం
సీఐఐ సదస్సు విజయవంతం కావడంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, ఐట మంత్రి నారా లోకేశ్ కీలక పాత్ర పోషించారని చెప్పారు. పెట్టుబడులను ఆకర్షించేందుకు సీఎం చంద్రబాబు యూఏఈలో, మంత్రి లోకేశ్ లండన్‌లో పెట్టుబడిదారులతో చేసిన చర్చలు రాష్ట్ర నమ్మకాన్ని పెంపొందించాయని తెలిపారు. రాష్ట్రం మరియు కేంద్రం మధ్య నెలకొన్న సత్సంబంధాల వల్ల పెట్టుబడు లకు మరింత అనుకూల వాతావరణం ఏర్పడిరదని, కేంద్ర ప్రభుత్వం కూడా పలు నిబంధనలను సడలిస్తూ సహకరిస్తోందని చెప్పారు.One Call – One Deal భావనతో ప్రభుత్వం పనిచేస్తుండటం వలన పెట్టుబడిదారుల్లో విశ్వాసం పెరిగింద న్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు Speed of Doing Business విధానాన్ని అమలు చేస్తూ కేవలం 45 రోజుల్లో పరిశ్రమలకు అనుమతులు మంజూరు చేసే వ్యవస్థ అమల్లోకి వచ్చిందని తెలిపారు.
రూ.13 లక్షల కోట్ల పెట్టుబడులు
రెండు రోజుల సీఐఐ సదస్సు ఫలితంగా రాష్ట్రంలో రూ. 13 లక్షల కోట్లు పైబడిన పెట్టుబడులు సమకూరగా, 112 ప్రాజెక్టులు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు జరగడం రాష్ట్ర పురోగతికి శుభ సంకేతమని మంత్రి చెప్పారు. ఈ పెట్టుబడులు ఏపీ యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు సృష్టిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. గ్రీన్ ఎనర్జీ, ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్స్, స్పేస్, డిఫెన్స్, టూరిజం వంటి రంగాల్లో భారీ పెట్టుబడులు రావడం అభివృద్ధికి నాంది పలుకుతుందని వివరించారు. సదస్సుకు రెండు నెలల ముందుగానే సమగ్ర ప్రణాళికతో ఏర్పాట్లు చేసిన ప్రభుత్వ యంత్రాంగాన్ని మంత్రి అచ్చెన్నాయుడు అభినందించారు.













