విశాఖపట్నం (చైతన్యరథం): ఎలక్ట్రానిక్స్ సిస్టమ్ డిజైన్, తయారీ (ESDM) – సెమీ కండక్టర్స్ లో పేరెన్నిగన్న సిలికాన్ జెన్ సంస్థ చైర్మన్ చీదా చిదంబరంతో శనివారం విశాఖలో మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ… ఏపీలో కో-లొకేటెడ్ ఓశాట్ తో సెమీ కండక్టర్స్ ఫ్యాబ్రికేషన్ (ఫ్యాబ్), చిప్ డిజైనింగ్ సెంటర్ ఏర్పాటు చేయాలని కోరారు. ఏపీ ఐటీి, సెమీ కండక్టర్స్ పాలసీ 2.0లో దేశంలోనే అత్యుత్తమ ప్రోత్సాహకాలు ఉన్నాయని తెలిపారు. దీనిపై సంస్థ చైర్మన్ చీదా చిదంబరం మాట్లాడుతూ…. ఇంటిగ్రేటెడ్ సిస్టమ్-ఇన్-ప్యాకేజ్ (SiP) సొల్యూషన్స్ కోసం అధునాతన 3డీ వేఫర్ స్టాకింగ్ (వేఫర్-ఆన్-వేఫర్, డై-ఆన్-వేఫర్)పై తాము దృష్టి సారించినట్లు చెప్పారు. AI GPU\T, జూఖలు, హై-బ్యాండ్‌విడ్త్ మెమరీ (HBM), పవర్ మేనేజ్‌మెంట్ IC\T (PMIC\T) తయారీపై తమకు ఆసక్తి ఉందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదనలపై తమ సంస్థలో చర్చించి సానుకూల నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.













