విశాఖపట్నం (చైతన్యరథం): ఏపీలో హైడ్రో టర్బైన్ తయారీ యూనిట్ నెలకొల్పాలని కిర్లోస్కర్ బ్రదర్స్ లిమిటెడ్ (కేబీఎల్) ఎండీ అలోక్ కిర్లోస్కర్‌ను రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ కోరారు. విశాఖలో జరుగుతున్న సీఐఐ భాగస్వామ్య సదస్సులో శుక్రవారం కేబీఎల్ ఎండీ అలోక్ కిర్లోస్కర్ తో మంత్రి లోకేష్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ… ఆంధ్రప్రదేశ్ గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ, రెన్యువబుల్ ఎనర్జీ లక్ష్యాలకు అనుగుణంగా హైడ్రో టర్భైన్లు, సౌర పంపింగ్ వ్యవస్థల తయారీ యూనిట్ ను ఏపీలో ఏర్పాటు చేయాలని కోరారు. నీటిపారుదల, మునిసిపల్ నీటి సరఫరా, పారిశ్రామిక వినియోగానికి కీలకమైన వర్టికల్ టర్బైన్ పంపుల కోసం ఏపీలో ఒక ప్రత్యేక ప్లాంట్‌ను స్థాపించండి. ఏపీ పారిశ్రామిక కారిడార్లలో ముఖ్యంగా విశాఖపట్నం-చెన్నయ్ కారిడార్ లో ఐఓటి ఆధారిత మురుగునీటి పంపింగ్ వ్యవస్థ, నీటి నిర్వహణ వ్యవస్థను ఏర్పాటు చేయండి. పారిశ్రామిక, పట్టణ మౌలిక సదుపాయాల కోసం ఖూ/ఖీవీ-సర్టిఫైడ్ ఫైర్ పంపులు, పెద్ద వాల్వ్‌లను (2400 ఎఎ దీఖీప వరకు) ఉత్పత్తి చేసే ూూూ పంపుల సౌకర్యాన్ని ఏర్పాటు చేయండి. ఏపీలో పారిశ్రామిక క్లస్టర్లు, స్మార్ట్ సిటీలలో భద్రతా వ్యవస్థలకు పెరుగుతున్న డిమాండ్ దృష్ట్యా అవి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని మంత్రి లోకేష్ చెప్పారు. దీనిపై అలోక్ కిర్లోస్కర్ మాట్లాడుతూ… తమ సంస్థ ఉత్పత్తులను ప్రపంచవ్యాప్తంగా 80 దేశాలకు ఎగుమతి చేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం విశాఖపట్నం, విజయవాడ నగరాల్లో తమ సంస్థ కార్యాలయాలు ఉన్నాయని, ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలను పరిశీలిస్తామని చెప్పారు.















