విశాఖపట్నం (చైతన్య రథం): జాతీయ బాలల దినోత్సవం సందర్భంగా చిన్నారులందరికీ ముఖ్యమంత్రి చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. ఈమేరకు ఎక్స్ వేదికగా పోస్టు పెడుతూ.. ‘‘రేపటి తరాన్ని అన్నివిధాలా శక్తివంతంగా, సమర్థవంతంగా తీర్చిదిద్దడం కోసం… వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేసేందుకు కూటమి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోంది. బాలలకు చదువు చెప్పిస్తే అది వారి పరిపూర్ణ వికాసానికి దోహదం చేస్తుంది. అందుకే ‘తల్లికి వందనం’ పథకం ద్వారా పిల్లలందర్నీ బడికి పంపించేలా ప్రోత్సహిస్తున్నాం. మధ్యాహ్న భోజన పథకంలో సైతం పిల్లలకు ఇష్టమైన మెనూ ఉండేలా చూస్తున్నాం. అలాగే పిల్లల పథకాలకు స్ఫూర్తి ప్రదాతల పేర్లు పెట్టాం. ప్రభుత్వ ఆశయాన్ని అర్థం చేసుకుని బాలలందరూ బాగా చదువుకుని వృద్ధిలోకి రావాలని ఆకాంక్షిస్తూ.. మరోసారి చిన్నారులందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు’’ అని పేర్కొన్నారు.














