- భారత్‌లో గ్రోత్ ఇంజన్లుగా టైర్-2 నగరాలు
- ఐటీ, జీసీసీ పాలసీలతో అత్యుత్తమ ప్రోత్సాహకాలు ఇస్తున్నాం
- ఇది చరిత్ర సృష్టించే సమయం
- టైర్-2 నగరాలపై సీఐఐ భాగస్వామ్య సదస్సులో మంత్రి నారా లోకేష్
- 42 ఐటీ సంస్థలతో రూ.44,255 కోట్ల మేర పెట్టుబడులకు ఎంవోయూలు
- 1,43,930 మందికి ఉద్యోగ అవకాశాలు
విశాఖపట్నం (చైతన్యరథం): ఏపీలో ప్రతిభకు కొదవ లేదని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. భారతదేశంలోని టైర్ -2 నగరాల్లో ఐటీ, జీసీసీల ఏర్పాటు ` ప్రతిబంధకాలు అధిగమిస్తున్నామా… భ్రమలు కల్పిస్తున్నామా? (Iు aఅస Gజజం ఱఅ ుఱవతీ-2 షఱ్‌ఱవం ఱఅ Iఅసఱa: దీతీవaసఱఅస్త్ర దీaతీతీఱవతీం శీతీ దీబఱశ్రీసఱఅస్త్ర Iశ్రీశ్రీబంఱశీఅం?) అనే అంశంపై విశాఖ పార్టనర్‌షిప్ సమ్మిట్‌లో శుక్రవారం జరిగిన సదస్సులో మంత్రి లోకేష్ ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ప్రైమస్ పార్టనర్స్ లిమిటెడ్ సీఈఓ నిలయవర్మ హోస్ట్‌గా వ్యవహరించారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ ఏపీనే ఎందుకు పరిగణనలోకి తీసుకోవాలన్న ప్రశ్నకు ఒకే ఒక కారణం ఉంది. ఇక్కడ ప్రతిభ ఉంది. రెండో ముఖ్య విషయం.. ఇతర ప్రధాన నగరాలతో పోలిస్తే.. విశాఖ ఖర్చు పరంగా పెద్ద ప్రయోజనం ఇస్తుంది. జీసీసీల ఏర్పాటుకు అవసరమైన మౌలిక సౌకర్యాలను కల్పిస్తున్నాం. మూడో కారణం.. ఏపీలో ప్రతిభ మాత్రమే కాదు.. యువతను జీవితాంతం నేర్చుకునేలా చేసే మెకానిజాన్ని కూడా నిర్మిస్తున్నాం. నైపుణ్యం పోర్టల్‌ను ప్రారంభించబోతున్నాం. ఈ తరహా ప్రాజెక్ట్ దేశంలోనే మొదటిది. స్కిల్ సెన్సెస్ కూడా చేయబోతున్నాం. కార్పెంటర్ నుండి ఏఐ ఇంజనీర్ వరకు ప్రతి ఒక్కరి స్కిల్స్‌ను అంచనా వేసి, వారి బలం, బలహీనతలను గుర్తించి, అనుకూలమైన స్కిల్ పార్ట్‌నర్లు వచ్చి వారికి సరైన శిక్షణ ఇవ్వడానికి ఒక వ్యవస్థని ఏర్పాటుచేస్తున్నాం. ఈ మూడు కారణాలు ఏపీనే ఎందుకు ఎంచుకోవాలి అనేందుకు నిదర్శనంగా నిలుస్తాయని మంత్రి లోకేష్ చెప్పారు.
ఇది చరిత్ర సృష్టించే సమయం
స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మా విధానం. వేగవంతమైన సౌకర్యాల కల్పన కోసం పెట్టుబడిదారులు ఏపీని ఎంచుకుంటారు. అందుకు మేం కూడా సిద్ధంగా ఉన్నాం. కార్పొరేట్లు ఎంత వేగంగా పనిచేస్తారో, దాని కంటే వేగంగా మేం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇది చరిత్ర సృష్టించే సమయం. అందరం కలిసి రాష్ట్రంతో పాటు దేశం గర్వపడే విధంగా చేయాలి. ప్రస్తుతం విశాఖపట్నం కేవలం సముద్రతీర పారిశ్రామిక నగరంగానే కాకుండా భారతదేశ ప్రతిష్టాత్మక డిజిటల్ డెస్టినేషన్‌గా తయారైంది. ఇప్పటికే ఆర్థిక సేవలు, ఆరోగ్య విశ్లేషణలు, ఇంజనీరింగ్ డిజైన్, ఏఐ ఆధారిత ప్రొడక్షన్ డెవలప్‌మెంట్ వంటి విభాగాల్లో అనేక ప్రముఖ ఐటీి, జీసీసీి కార్యకలాపాలకు విశాఖనగరం వేదికగా నిలుస్తోంది.
మెట్రో నగరాల కంటే 20% తక్కువ నిర్వహణ ఖర్చులు, అత్యుత్తమ జీవన ప్రమాణాలు, 25వేలకు పైగా ఐటీ నిపుణులతో సాంప్రదాయ విశాఖపట్నం… గ్లోబల్ స్థాయిలో విశ్వసనీయమైన టైర్` 2 నగరంగా తయారైంది. భారత ఐటీి పరిశ్రమ ప్రపంచంలో నమ్మకమైన టెక్నాలజీ భాగస్వామిగా రూపుదిద్దుకుంటోంది. దీర్ఘకాలంగా పరిమిత అవకాశాలు గల ప్రాంతాలుగా ఉన్న టైర్ -2 నగరాలు… ఇప్పుడు భారతదేశంలో సర్వసన్నద్ధంగా తయారై కొత్త గ్రోత్ ఇంజన్లుగా మారాయి. మా ఐటీ పాలసీ 2024-30, జీసీసీిలకు అత్యుత్తమ ప్రోత్సాహకాలు అందిస్తోంది. జీసీసీలు ఇప్పుడు ఖర్చు కేంద్రాలు కాదు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ, ఫిన్‌టెక్, డిజైన్ ఆధారిత ఆర్ అండ్ డీ ని నడుపుతున్న ఆవిష్కరణ కేంద్రాలు. టైర్ -2 నగరాల అభివృద్ధికి విశాఖనగరం చక్కటి నమూనాగా నిలుస్తోంది. ఇది ఆంధ్రప్రదేశ్ లోనే కాకుండా భారతదేశంలోనే బలమైన డిజిటల్ ఆర్థిక నగరంగా మారుతోందని మంత్రి లోకేష్ అన్నారు.
42 ఐటీ సంస్థలతో రూ.44,255 కోట్ల మేర పెట్టుబడులకు ఎంవోయూలు
మంత్రి లోకేష్ సమక్షంలో 42 ఐటీ, ఐటీఈఎస్, జీసీసీ, డేటా సెంటర్స్ సంస్థలతో రూ.44,255 కోట్ల పెట్టుబడులకు జీవోలు, ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఈ సదస్సులో ఎక్సా ఎక్సెల్ కంట్రీ హెడ్ అదితి శుక్లా, కాగ్నిజెంట్ ఆసియా పసిఫిక్ వైస్ ప్రెసిడెంట్ గౌరవ్ హజ్రా, క్వెస్ కార్ప్ లిమిటెడ్ సిఇఓ కపిల్ జోషి, మాస్టర్ కార్డ్ టెక్ హబ్స్ ఆసియా`పసిఫిక్ హెడ్ రాజేష్ మణి, టిసిఎస్ గ్లోబల్ హెడ్ శ్రీధర్ వెంకటరమణన్, ఎఎన్‌ఎస్‌ఆర్ కో ఫౌండర్ విక్రమ్ అహూజా, తదితరులు పాల్గొన్నారు.














