- భాగస్వామ్య సదస్సుకు ముందే భారీగా ఎంఓయూలు
- ఒక్క రోజులోనే 5 రంగాల్లో 35 ఎంఓయూలు
- రూ.3.65 లక్షల కోట్ల పెట్టుబడులు, 1.26 లక్షలమందికి ఉద్యోగాలు
- ఇంధన శాఖలోనే రూ.2.65 లక్షల కోట్ల పెట్టుబడులకు ముందుకొచ్చిన సంస్థలు
- ఏపీని విడిచి వెళ్లిన కంపెనీలను తిరిగి తెచ్చిన కూటమి ప్రభుత్వం
- పారిశ్రామికరంగానికి ఏపీ ఇస్తున్న సహకారానికి కంపెనీలనుంచి కితాబులు
- ప్రభుత్వం చేపట్టే అన్న క్యాంటీన్లకు భారీగా విరాళాలు
- వేగమే వేదంగా పెట్టుబడుల సాధనకు కృషి: ముఖ్యమంత్రి
- రోజంతా 15కు పైగా సమావేశాల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు
విశాఖపట్నం (చైతన్య రథం): పెట్టుబడులు ఆకర్షించడంలో రాష్ట్రాన్ని నెంబర్ 1 స్థానంలో నిలపడమే ధ్యేయంగా పని చేస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఈమేరకు వేగమే వేదంగా పెట్టుబడుల సాధనకు కృషి చేస్తున్నామన్నారు. విశాఖపట్నంలో పెట్టుబడుల సదస్సుకు ముందురోజు గురువారం జరిగిన వివిధ కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఉదయం నుంచి రాత్రి పొద్దుపోయే వరకు సుమారు 15కు పైగా సమావేశాలు నిర్వహించారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చిన వారితో వరుస భేటీలు నిర్వహించారు. అలాగే తైవాన్, ఇటలీవంటి దేశాల రాయబారులతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో వివిధ రంగాల్లో పెట్టుబడులకున్న అవకాశాలను వివరించారు. ఏయే ప్రాంతంలో ఏయే రంగానికి తాము ప్రాధాన్యత ఇస్తున్నామో వివరించడంతోపాటు… ఆయా ప్రాంతాల్లో పెట్టుబడులు పెట్టేందుకు అనువైన వాతావరణం ఏవిధంగా ఉంది? అక్కడ కనెక్టివిటీ ఏవిధంగా అభివృద్ధి చేశామనే విషయాలను వివిధ పారిశ్రామికవేత్తలకు సీఎం సవివరంగా వివరించారు. అలాగే తైవాన్, ఇటలీ దేశాలకు చెందిన పరిశ్రమలను ఏపీలో పెట్టుబడులు పెట్టేలా చూడాలని ఆ దేశాల రాయబారులను ముఖ్యమంత్రి కోరారు. ఇక వివిధరంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు సంస్థలు ముందుకు రావడంతో పాటు… ప్రతిపాదనలతో వచ్చిన కంపెనీలతో ఎంఓయూలు కుదుర్చుకున్నారు.
ఈమేరకు రాష్ట్రానికి భారీఎత్తున పెట్టుబడులు పెట్టేలా వివిధ కంపెనీలు ముందుకొచ్చాయి. మొత్తంగా 35 ఎంఓయూలను ఒక్క రోజులోనే ముఖ్యమంత్రి సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వం కుదుర్చుకుంది. ఈ ఎంఓయూలు ద్వారా భారీ పెట్టుబడులు రానున్నాయి. భాగస్వామ్య సదస్సు ప్రారంభానికి ముందురోజే ఏకంగా రూ.3.65 లక్షల కోట్ల పెట్టుబడులు, 1.26 లక్షలమందికి ఉద్యోగాలు కల్పించేందుకు కంపెనీలు ముందుకొచ్చాయి. ఇలా పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చిన కంపెనీల్లో రెన్యూ పవర్‌వంటి ప్రముఖ సంస్థలు గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంనుంచి వెళ్లిపోయాయి. అప్పటి విధానాలు నచ్చక రాష్ట్రం విడిచి వెళ్లిన సంస్థలను తిరిగి ఏపీకి రప్పించడంలో కూటమి ప్రభుత్వం విజయం సాధించింది. రెండు రోజులపాటు జరిగే భాగస్వామ్య సదస్సులో సుమారుగా రూ.10 లక్షల కోట్లమేర పెట్టుబడులు వస్తాయనే అంచనాలున్నాయి. అయితే ఆ సదస్సు కంటే ముందే రూ.3.65 లక్షల కోట్ల పెట్టుబడులు రావడంతో ప్రభుత్వం సంతృప్తి వ్యక్తం చేస్తోంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్లకు రూ. కోటి విరాళం చెక్కును బాలాజీ యాక్షన్ బిల్డ్‌వేర్ సంస్థ ముఖ్యమంత్రికి అందించింది.
వనరులున్నాయి… కనెక్టివిటీ ఉంది…
భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చిన వివిధ పరిశ్రమల ప్రతినిధులతో ముఖ్యమంత్రి చంద్రబాబు వరుస సమావేశాలు నిర్వహించారు. అలాగే ఎంఓయూలు కుదుర్చుకునేందుకు నిర్వహించిన కార్యక్రమంలోనూ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ..‘‘సీఐఐ సదస్సుకు ముందుగానే ఈస్థాయిలో పెట్టుబడులు రావడం చాలా సంతోషకరం. పెట్టుబడులకు ముందుకొచ్చిన పారిశ్రామికవేత్తలకు ధన్యవాదాలు. జాతీయ, అంతర్జాతీయస్థాయిలో ఏపీలో పరిశ్రమలు స్థాపించడానికి వివిధ సంస్థలు ముందుకొస్తున్నాయి. గూగుల్, ఆర్సెల్లార్ మిట్టల్, బీపీసీఎల్‌వంటి భారీ పెట్టుబడులు రాష్ట్రానికి వస్తున్నాయి. దేశం వేగంగా అభివృద్ది చెందుతోంది. ఆ వేగంలో మనం ముందుడాలి. పెట్టుబడులు సాధించాలి. రాష్ట్రాన్ని పెట్టుబడుల్లో ముందుంచాలనేది ప్రభుత్వ ప్రయత్నం. గ్రీన్ ఎనర్జీ రంగంలో రాష్ట్రంలో అనేక అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వం రూపొందించిన ఎనర్జీ పాలసీ మంచి ఫలితాలనిస్తోంది. అందుకే ఇంధన రంగంలో భారీఎత్తున పెట్టుబడులు వచ్చాయి. ఏపీకి 1000 కి.మీ మేర సముద్ర తీరం ఉంది. పోర్టులు, రోడ్లు, రైలుమార్గం వంటి వాటిద్వారా లాజిస్టిక్స్ రంగానికి ఏపీ కేంద్ర బిందువుగా మారుతుంది. రాష్ట్రంలో అన్ని రంగాల్లో పెట్టుబడులకు అవకాశం ఉంది… దీన్ని వినియోగించుకోవాలని పారిశ్రామికవేత్తలను కోరుతున్నా.
హార్టికల్చర్, అగ్రికల్చర్, ఆక్వాకల్చర్ రంగాల్లో విస్తృత అవకాశాలు ఉన్నాయి. ఫుడ్ ప్రాసెసింగ్ రంగానికి రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో అవకాశాలు ఉన్నాయి. స్పేస్ సిటీ, డ్రోన్ సిటీ, ఎలక్ట్రానిక్ సిటీవంటి వాటిని ఏర్పాటు చేసుకుంటున్నాం. రాష్ట్రంలో పెద్దఎత్తున మినరల్ వెల్త్ ఉంది. వీటి విలువను మరింత పెంచగలిగే పరిశ్రమలు తెస్తున్నాం. ఒక కుటుంబం ఒక వ్యాపారవేత్త అనే నినాదంతో ప్రభుత్వం పనిచేస్తోంది. ఆలోచనలతో వచ్చేవారికి అవకాశాలు కల్పిస్తాం. ఒప్పందం చేసుకున్న ప్రతి సంస్థకు భూములు కేటాయిస్తున్నాం. పారిశ్రామికవేత్తలు వేగంగా పనులు గ్రౌండ్ చేయడానికి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానంతో వెళ్తున్నాం. మా ప్రభుత్వం నుంచి అనుమతులు సహా ఏ విషయంలోనూ జాప్యం ఉండదు’’ అని ముఖ్యమంత్రి వెల్లడిరచారు.
పెట్టుబడుల వెల్లువ… ఉద్యోగాల కల్పన…
శుక్రవారంనుంచి రెండు రోజులపాటు పెట్టుబడుల సదస్సు ప్రారంభమవుతుంటే… దానికంటే రోజుముందే వివిధ పరిశ్రమలు భారీఎత్తున పెట్టుబడులకు సిద్ధమయ్యాయి. రూ.3.65 లక్షల కోట్లమేర పెట్టుబడులపై ఎంఓయూలు కుదిరాయి. మొత్తంగా 5 రంగాల్లో ఈ పెట్టుబడులు రాగా… ఒక్క ఇంధన రంగం నుంచే రూ.2,64,787 లక్షల కోట్ల పెట్టుబుడులు వచ్చాయి. ఇంధన శాఖ 7 ఎంఓయూలు కుదుర్చుకుని పెట్టుబడులను రాబట్టింది. ఇంధన రంగంలో వచ్చిన పెట్టుబడుల ద్వారా 49,400 మందికి ఉద్యోగాలు రానున్నాయి. ఇక మిగిలిన నాలుగురంగాల్లో పెట్టుబడులు వచ్చిన విధానం పరిశీలిస్తే… 8 ఒప్పందాల ద్వారా ఏపీ సీఆర్డీఏకు రూ.32,300 కోట్లు, 7800 మందికి ఉద్యోగాలు రానున్నాయి. 4 ఎంఓయూల ద్వారా ఫుడ్ ప్రాసెసింగ్ రంగానికి రూ.2319 కోట్ల పెట్టుబడి, 8166 మందికి ఉద్యోగాలకు అవకాశం ఉంది. 3 ఒప్పందాల కుదుర్చుకుని ఐ అండ్ ఐ రంగంలో రూ.12,255 కోట్ల పెట్టుబడులు, 1300 మందికి ఉద్యోగాలు కల్పించేందుకు వివిధ సంస్థలు ముందుకు వచ్చాయి. మరోవైపు 3 ఎంఓయూల ద్వారా రూ.52,143 కోట్ల పెట్టుబడుల ద్వారా 32,105 మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చేలా పరిశ్రమలు-వాణిజ్యం రంగం ఆయా సంస్థల నుంచి హామీ పొందింది.
కంపెనీల వివరాలివి…
రాష్ట్ర ప్రభుత్వంతో ఏయే కంపెనీలు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి? ఎంత మేర పెట్టుబడులు పెట్టనున్నాయి? ఏమేరకు ఉద్యోగావకాశాలు కల్పిస్తాయనే వివరాలను ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది.
ఇంధన రంగం…
ఏబీసీ క్లీన్ టెక్ అండ్ ఆక్సిస్ ఎనర్జీ వెంచర్స్ -రూ.1,10,250 కోట్లు. 13500 మందికి ఉద్యోగాలు
రీన్యూ పవర్- రూ.25000 కోట్లు. 10000 మందికి ఉద్యోగాలు
రీన్యూ ఇ-ఫ్యూయల్స్ ప్రైవేట్ లిమిటెడ్- రూ.17000 కోట్లు. 1100మందికి ఉద్యోగాలు.
రీన్యూ ప్రైవేట్ లిమిటెడ్- రూ.12500 కోట్లు. 3250మందికి ఉద్యోగాలు
నవయుగ ఇంజనీరింగ్- రూ.23427 కోట్లు. 6300మందికి ఉద్యోగాలు
చింతా గ్రీన్ ఎనర్జీ- రూ.27955 కోట్లు. 6600మందికి ఉద్యోగాలు
ఫోర్ స్క్వేర్ గ్రీన్ ఎనర్జీ- రూ.10205 కోట్లు. 1750మందికి ఉద్యోగాలు
ఇండోసోల్- రూ.23450 కోట్లు. 6900మందికి ఉద్యోగాలు
షిర్డీ సాయి- రూ.15000 కోట్లు. 15400మందికి ఉద్యోగాలు
పరిశ్రమలు- వాణిజ్య రంగం:
రెన్యూ ఫొటో వాల్ టైక్స్- రూ.5451 కోట్లు, 3600మందికి ఉద్యోగాలు
ఇండోసోల్- రూ.2200 కోట్లు. 500మందికి ఉద్యోగాలు
షిర్డీ సాయి- రూ.5000 కోట్లు. 5000మందికి ఉద్యోగాలు
వైజాగ్ ప్రొఫైల్స్ లాజిస్టిక్స్- రూ.6000 కోట్లు. 5250మందికి ఉద్యోగాలు
స్టీల్ ఎక్స్ఛేంజ్ ఇండియా- రూ.4650 కోట్లు. 5400మందికి ఉద్యోగాలు
విరూపాక్ష ఆర్గానిక్స్- రూ.1189 కోట్లు. 2000మందికి ఉద్యోగాలు
అనంత్ టెక్నాలజీస్- రూ.1000 కోట్లు. 1000మందికి ఉద్యోగాలు
ఏటీఆర్ వేర్ హౌసింగ్- రూ.1100 కోట్లు. 6200మందికి ఉద్యోగాలు
లారస్ ల్యాబ్స్- రూ.1000 కోట్లు. 500మందికి ఉద్యోగాలు
మారుతి ఇస్పాత్ అండ్ పైప్స్- రూ.1000 కోట్లు. 1800మందికి ఉద్యోగాలు
ప్రీమియర్ ఎక్స్ ప్లోజివ్స్- రూ.1000 కోట్లు. 500మందికి ఉద్యోగాలు
మల్లాది ఫార్మా- రూ.353 కోట్లు. 355మందికి ఉద్యోగాలు
ఈజౌల్- రూ.19000 కోట్లు. 1800మందికి ఉద్యోగాలు
కోరమండల్- రూ.2000 కోట్లు. 500మందికి ఉద్యోగాలు
తైవాన్ ప్రైవేట్ ఇండస్ట్రీయల్ పార్క్స్- రూ.1200 కోట్లు. 10000మందికి ఉద్యోగాలు
జూల్- రూ.1500 కోట్లు. 1000మందికి ఉద్యోగాలు
ఏపీ సీఆర్డీఏ:
మణిపాల్ గ్రూప్- రూ.15000 కోట్లు. 1000మందికి ఉద్యోగాలు
బెర్జాయ గ్రూప్- రూ.8300 కోట్లు
అమరావతి లైఫ్ సైన్సెస్- రూ.2000 కోట్లు
మైసిటీ- రూ.2000 కోట్లు
వివెన్స్ గ్రూప్- రూ.2000 కోట్లు. 5000మందికి ఉద్యోగాలు
ఫ్యాషన్ ఎంటర్ ప్రెన్యూర్ ఫండ్- రూ.1200 కోట్లు. 1200మందికి ఉద్యోగాలు
ఏస్ అర్బన్ డెవలపర్స్- రూ.1800 కోట్లు. 600మందికి ఉద్యోగాలు
ఐ అండ్ ఐ:
క్రౌన్ ఎల్‌ఎన్జీ- రూ.10640 కోట్లు.
ఆర్సీఆర్టీ- రూ.1615 కోట్లు. 1300మందికి ఉద్యోగాలు
ఫుడ్ ప్రాసెసింగ్:
ఉమెన్ ఓవా అగ్రో ఫుడ్ పార్క్- రూ.1440 కోట్లు. 7000మందికి ఉద్యోగాలు
ఐటీసీ ఫుడ్స్- రూ.400 కోట్లు. 500మందికి ఉద్యోగాలు
గాడ్రేజ్ అగ్రో వెట్- రూ.279 కోట్లు. 66మందికి ఉద్యోగాలు
బిస్లరీ- రూ.200 కోట్లు. 500మందికి ఉద్యోగాలు















