- సంక్షేమం, సంపద సృష్టి ప్రభుత్వ లక్ష్యం
- బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత
- కడపలో ఏడు యూనిట్లకు శంకుస్థాపన
కడప(చైతన్యరథం): ప్రజా సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభు త్వం పాలన సాగిస్తూ స్థానిక వనరులతో సంపదను సృష్టించే ప్రణాళికలు, ముందుచూపుతో ముఖ్యమంత్రి ముందుకు వెళుతున్నారని జిల్లా ఇన్‌చార్జి మంత్రి, బీసీ సంక్షేమ, చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత ప్రశంసించారు. మంగళవారం పరి శ్రమలు – ఉపాధి కల్పనలో భాగంగా ప్రకాశం జిల్లా కనిగిరి పరిధిలోని పెదఈర్లపాడులో ఎంఎస్‌ఎంఈ పార్కుతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా 17 జిల్లాలలోని 50 ఎంఎస్‌ఎంఈ పార్కులకు ముఖ్యమంత్రి చంద్రబాబు వర్చువల్ విధానంలో ప్రారంభోత్స వాలు, శంకుస్థాపనలు చేశారు. ఈ కార్యక్రమాన్ని వర్చువల్ విధానంలో వీక్షిస్తూ స్థానిక కలెక్టరేట్ సభాభవన్ నుంచి కడప జిల్లాలో రూ.4,322 కోట్ల పెట్టుబడులతో 1179.64 ఎకరాల్లో 7 పరిశ్రమల యూనిట్లకు మంత్రి సవిత శంకుస్థాపన చేశారు. జిల్లా కలెక్టం శ్రీధర్ చెరుకూరి, ప్రభుత్వ విప్‌లు జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, కడప ఎమ్మెల్యే ఆర్.మాధవిరెడ్డి లు, కమలాపురం ఎమ్మెల్యే పుత్తా కృష్ణచైతన్యరెడ్డి, ఏపీఐఐసీ డైరెక్టర్ ప్రసాదరెడ్డి హాజరయ్యారు. మంత్రి సవిత మాట్లాడుతూ అభివృద్ధే ద్యేయంగా.. అడుగులేస్తున్న ప్రభుత్వం మనది. ఒక వైపు ప్రజలకు సంక్షేమ పాలన అందిస్తూ.. మరొకవైపు సంపద ను సృష్టిస్తూ లక్షలాది మందికి.. ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించే దిశగా వనరులను సమకూరుస్తున్న ముఖ్యమంత్రి ముందుచూపు ఉన్న గొప్ప నాయకుడు.
అన్ని నియోజకవర్గాల్లో ఎంఎస్‌ఎంఈ పార్కులను ఏర్పాటు చేసి స్థానిక యువతకు పుష్కలంగా ఉపాధి అవకాశాలను అందించాలన్నదే ఆయన లక్ష్యం. ఈ రోజు జిల్లాలోని ప్రొద్దుటూరు, మైదుకూరు, పులి వెందుల నియోజకవర్గాల్లో ఎంఎస్‌ఎంఈ పార్కుల ఏర్పాటుకు శిలాఫలకాలు ఆవిష్కరించడం జరిగిందన్నారు. వచ్చే సంవత్స రం లోగా ఆయా పార్కుల్లో అన్ని రకాల మౌలిక సదుపాయా లను సమకూర్చి స్థానిక ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు యూని ట్లు నెలకొల్పుకునే అవకాశం కల్పించడం జరుగుతుం దని తెలిపారు. ఇప్పటికే జిల్లాలో పారిశ్రామిక విప్లవం మొదలైం దన్నారు. జిల్లాలో ఏపీఐఐసీ ఆధ్వర్యంలో వేలాది ఎకరాల్లో.. పలు భారీ పరిశ్రమలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలతో.. త్వరలోనే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు అందనున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిశ్రమల కేంద్రం జీఎం చాంద్ బాషా, ఏపీఐఐసీ జెడ్‌ఎం శ్రీనివాస మూర్తి, పారిశ్రామిక వేత్తలు, సంబంధిత అధికారులు, తదితరులు హాజరయ్యారు.












