- 8.2 మిలియన్ టన్నుల ప్రాజెక్టు పనుల ప్రారంభానికి సర్వం సిద్ధం
- రికార్డు సమయంలో 14 నెలల్లోనే భూమి, ప్రధాన అనుమతులన్నీ పూర్తి
- ఈ నెల 14-15 తేదీల్లో సీఐఐ పార్టనర్ షిప్ సమ్మిట్ సందర్భంగా భూమిపూజ
అమరావతి (చైతన్యరథం): పారిశ్రామికాభివృద్ధిలో శరవేగంగా దూసుకుపోతున్న ఆంధ్రప్రదేశ్ మరో కీలకమైన మైలురాయిని అధిగమించింది. అనకాపల్లి సమీపంలో ఆర్సెలర్ మిట్టల్ అండ్ నిప్పాన్ స్టీల్స్ (ఏఎం/ఎన్‌ఎస్) సంస్థ 8.2 మిలియన్ టన్నుల వార్షిక ఉత్పత్తి సామర్థ్యంతో ఏర్పాటు చేయబోతున్న ఉక్కు కర్మాగారానికి భారత పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ (వీశీజుఖీ) ఎక్స్‌పర్ట్ అప్రైజల్ కమిటీ (జుAజ) పర్యావరణ అనుమతికి సిఫారసు చేసింది. రూ. 1.5 లక్షల కోట్ల పెట్టుబడితో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటుచేయనున్న ఈ స్టీల్ ప్లాంట్ భారతదేశంలోనే అతిపెద్ద గ్రీన్‌ఫీల్డ్ ఉక్కు తయారీ కర్మాగారంగా రికార్డు సృష్టించనుంది. ఈ నెల 14-15 తేదీల్లో విశాఖపట్నంలో నిర్వహించనున్న పార్టనర్ షిప్ సమ్మిట్‌లో ఆర్సెలర్ మిట్టల్ స్టీల్ ప్లాంట్‌కు భూమిపూజ చేయనున్నారు. ఏఎం/ఎన్‌ఎస్ కర్మాగారాన్ని వివిధ దశల్లో అభివృద్ధి చేస్తారు. మొదటి దశలో 8.2 మిలియన్ టన్నుల సామర్థ్యంతో ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ నిర్మాణం చేపడతారు. చివరి దశల్లో దీనిని 24 మిలియన్ టన్నుల వరకు విస్తరించనున్నారు. ఈ పరిశ్రమను అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించి ప్రస్తుత వాతావరణ పరిస్థితులకు లోబడి అతితక్కువ వాయు కాలుష్యం ఉండేలా, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ఏర్పాటుచేయనున్నారు.
మంత్రి లోకేష్ కృషి
ఈ కర్మాగారం పూర్తి స్థాయిలో ప్రారంభమైతే, ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ కారిడార్‌లో ప్రధాన పరిశ్రమగా ఉంటుంది. దీనికి అనుబంధంగా ఉక్కు ఆధారిత ఔట్‌పుట్ యూనిట్లు, మిషనరీ తయారీ క్లస్టర్లు, లాజిస్టిక్స్ నెట్‌వర్క్‌లు మొదలైనవి అభివృద్ధి చెందుతాయి. ఏఎం/ఎన్‌ఎస్ (ఆర్సెలర్ మిట్టల్ – జపాన్ సంస్థ నిప్పాన్ స్టీల్ ల సంయుక్త భాగస్వామ్యం)తో 2024 ఆగస్టులోనే రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ చర్చలు జరిపారు. భారతదేశంలో అత్యుత్తమ ఉక్కు తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు భూమి, విధాన పరమైన మద్దతును ఏఎం/ఎన్‌ఎస్ కోరింది. ప్రభుత్వం మూడే నెలల్లో అవసరమైన భూమిని కేటాయించి, పరిశ్రమ ఏర్పాటుకు అవసరమైన అన్ని అనుమతులు మంజూరయ్యే వరకు సింగిల్-విండో మాధ్యమంగా తక్షణమే పూర్తి సహాయ, సహకారాలను అందించింది. తాజాగా వచ్చిన వీశీజుఖీ అనుమతి ద్వారా ప్రాజెక్ట్‌కు 14 నెలల్లోనే అన్ని ప్రధాన అనుమతులూ పూర్తయినట్లయింది. ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నేతృత్వంలో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, పెట్టుబడుల ఆకర్షణకు అనుసరిస్తున్న ప్రొయాక్టివ్ విధానానికి ఇది అద్దం పడుతోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలుచేస్తున్న ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాలు, పారదర్శక పాలన, మౌలిక వసతులపై ఉన్న ప్రత్యేక దృష్టి కారణంగా, ప్రపంచ ప్రఖ్యాత కంపెనీల పెట్టుబడులకు ఏపీ గమ్యస్థానంగా మారింది.
ఏపీ ప్రభుత్వ వేగం అద్భుతం: ఆదిత్య మిట్టల్
ఆర్సెలర్ మిట్టల్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సీఈవో ఆదిత్య మిట్టల్ మాట్లాడుతూ తాము కోరిన వెంటనే భూమిని కేటాయించి, మాకు అందజేయడం, అవసరమైన అన్ని అనుమతులు శరవేగంతో కల్పించడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వేగం మమ్నల్ని మంత్రముగ్ధుల్ని చేసిందన్నారు. తాముము కేవలం ఉక్కు కర్మాగారం కాకుండా పరిశ్రమలో వినూత్నశైలి, సుస్థిరత, కొత్త ఉద్యోగ అవకాశాలకు ముఖ్య కేంద్రంగా ఈ ప్రాజెక్టును తీర్చిదిద్దాలని భావిస్తున్నామని చెప్పారు.
ప్రభుత్వ సమర్థతకు నిదర్శనం: మంత్రి లోకేష్
ఏపీ మంత్రి నారా లోకేష్ (ఐటీ, ఎలక్ట్రానిక్స్, హెచ్‌ఆర్‌డీ, ఆర్టీజీఎస్) మాట్లాడుతూ అతితక్కువ సమయంలో ఈ ప్రాజెక్ట్‌కు అనుమతులు మంజూరు చేయడం.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వేగం, పారదర్శకత, సమర్థ పరిపాలనా విధానాలను తెలియజేస్తోందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నాయకత్వంలో ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా పారిశ్రామిక సహాయక వ్యవస్థను అభివృద్ధి చేశాం. ఏఎం/ఎన్‌ఎస్ ప్లాంట్ తీరప్రాంత ఉక్కు పరిశ్రమల్లో కీలక హబ్‌గా నిలుస్తుంది. లక్షల ఉద్యోగ అవకాశాలు, స్థానిక ఉత్పాదకత, ఎగుమతులు, నైపుణ్య అభివృద్ధి విభాగాలు పెరుగుతాయని పేర్కొన్నారు. ఈ నెల 14, 15 తేదీల్లో విశాఖపట్నంలో జరిగే సీఐఐ పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్ సందర్భంగా పరిశ్రమకు పునాదిరాయి వేయాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ సంస్థల సీఈవోలు, పాలసీ మేకర్లు, పరిశ్రమల ప్రముఖులు పాల్గొంటారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా ప్రాంతీయ మౌలిక వసతుల అభివృద్ధికి బలం చేకూరుతుంది. విజయనగరం-అనకాపల్లి- కాకినాడ పారిశ్రామిక ప్రాంతం అభివృద్ధి చెంది, భారతదేశాన్ని ప్రపంచ స్థాయిలో సుస్థిర ఉక్కు తయారీదారుగా నిలపడంలో కీలకంగా నిలుస్తుంది.














