ఉండవల్లి (చైతన్య రథం): మొంథా తుఫాన్ రక్షణ చర్యల్లో భాగంగా అత్యుత్తమంగా పనిచేసిన మంత్రులు, అధికార యంత్రాంగాన్ని సీఎం చంద్రబాబు అభినందించారు. శనివారం ఉండవల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన అభినందన కార్యక్రమంలో నిడదవోలు నియోజకవర్గంలో అత్యుత్తమ సేవలందించిన మంత్రి కందుల దుర్గేష్‌ను సీఎం చంద్రబాబు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సైక్లోన్ మొంథా ఫైటర్‌గా మెమొంటో అందచేసి.. సన్మానపత్రం అందించారు. విపత్కర సమయంలో పౌరుల భద్రత, శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని నిబద్ధతతో ప్రజాసేవలో అత్యున్నత ప్రమాణాలకు నిదర్శనంగా నిలిచిన మంత్రి కందుల దుర్గేష్ సేవలను సీఎం చంద్రబాబు కొనియాడుతూ హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ `ఆర్టీజీ సెంటర్‌నుంచి రియల్ టైమ్‌లో పర్యవేక్షించి.. రక్షణ, సహాయక చర్యల్లో పూర్తిస్థాయిలో టెక్నాలజీ వినియోగించడం, ప్రభుత్వ ముందస్తు చర్యలతో ఆస్తి, ప్రాణనష్టం తగ్గించడం, అధికార యంత్రాంగాన్ని, ప్రజలను అప్రమత్తం చేయడం, బాధితులకు పునరావాసం కల్పించడం, తుఫాను అనంతర పరిణామాల్లో సాధారణ పరిస్థితులు నెలకొల్పడంలో సీఎం చంద్రబాబు తనదైన మార్క్ చూపించారని ధన్యావాదాలు తెలిపారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేతృత్వంలో క్షేత్రస్థాయిలో పనిచేసిన అందరికీ మంత్రి దుర్గేష్ ధన్యవాదాలు తెలిపారు.














