- కార్యకర్తలు, నేతలను సొంత కుటుంబసభ్యుల్లా చూసుకుంటున్న టీడీపీ
- దేశంలోనే ఏ రాజకీయ పార్టీకి లేని కార్యకర్తల సంక్షేమ విభాగం టీడీపీ సొంతం
- కార్యకర్తలకు ఎంపీ, ఎమ్మెల్యే, నామినేటెడ్ పదవులు ఇచ్చి గౌరవించిన పార్టీ
- అనుబంధ సంఘాల బాధ్యతలు చూసేవారికీ నామినేటెడ్ పదవుల్లో అవకాశం
- ప్రమాద బీమాతో వేలాది మంది కార్యకర్తల కుటుంబాలకు సాయం
- రాజకీయ ప్రత్యర్థుల చేతుల్లో హత్యకు గురైన కార్యకర్తల కుటుంబాలకు అండగా నిలిచిన టీడీపీ
- వైసీపీ దాడిలో మృతిచెందిన చంద్రయ్య కొడుకుకి ప్రభుత్వ ఉద్యోగం
- విద్య, వైద్య, ఆర్థిక, ఉపాధికి కార్యకర్తలకు తోడుగా నిలుస్తున్న పార్టీ
అమరావతి (చైతన్యరథం): తెలుగుదేశం పార్టీకి కార్యకర్తే అధినేత.. పార్టీయే ఆదుకునే కుటుంబం. ఇది నాడూ – నేడూ తెలుగుదేశం పార్టీ మూల సూత్రం. అన్న ఎన్టీఆర్ నుంచి చంద్రబాబు, లోకేష్ తొలి ప్రాధాన్యం కష్టపడే కార్యకర్తకే ఇస్తారు. తెలుగుదేశం పార్టీకి కోట్లాది మంది కార్యకర్తలే బలం, బలగం. వారికి కుటుంబపెద్దలా వెన్నుదన్నుగా నిలుస్తూ కాపాడుకుంటూ, అండగా నిలుస్తూ వస్తోంది పార్టీ. అధికారం ఉన్నా, లేకున్నా కార్యకర్తల సంక్షేమం చూసేందుకు దేశంలోనే తొలిసారిగా ఏకంగా సంక్షేమ విభాగాన్నే ప్రారంభించిన ఏకైన పార్టీ తెలుగుదేశం.
టీడీపీ తో పార్టీ కార్యకర్తలది పేగు బంధం
కొన్ని నిదర్శనాలు
పేరు ఎంఎస్ రావు: నిరుపేద టీడీపీ కార్యకర్త. గుండెపోటుతో ఆస్పత్రిలో చేరారు. అప్పుడు టీడీపీ ప్రతిపక్షంలో ఉంది. పార్టీ కార్యాలయానికి సమాచారం ఇవ్వగా.. అవసరమైన సాయం అందించి సకాలంలో వైద్య చికిత్స చేయించారు.
శ్రీను లోకేషిస్ట్: టీడీపీ సోషల్ మీడియాలో తెలియని వారుండరు. ఆత్మహత్యాయత్నం చేశారు. ఆయనను బతికించుకునేందుకు ఒక టీముని ప్రత్యేకంగా నియమించారు నారా లోకేష్. దురదృష్టవశాత్తూ శ్రీనుని కాపాడుకోలేకపోయారు. వారి కుటుంబానికి అండగా నిలిచారు. అనంతపురం జిల్లాలో ప్రత్యర్థి రాజకీయ పార్టీల దాడుల్లో చనిపోయిన వారి పిల్లలను మళ్లీ ఫ్యాక్షన్ వైపు వెళ్లకుండా.. ప్రశాంత వాతావరణంలో అన్నీ తామై తెలుగుదేశం పార్టీయే చదివించి ప్రయోజకులుగా తీర్చిదిద్దింది. ఇలాంటి వందలాది మంది పిల్లలు నేడు సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా, ఉన్నతోద్యోగాలు చేస్తూ ఉన్నారు. ఇదీ తెలుగుదేశం పార్టీ కుటుంబ పెద్దగా నెరవేర్చిన బాధ్యత.
జై జగన్ అనకపోతే, పీక కోస్తామని గుండెలపై వైసీపీ ముష్కరులు కూర్చుంటే.. జై చంద్రబాబు అని ప్రాణాలొదిలిన సైనికుడిలాంటి తోట చంద్రయ్య లాంటి కార్యకర్త కుటుంబానికి అండగా నిలిచింది తెలుగుదేశం పార్టీ. చంద్రయ్య కొడుకుకి ప్రభుత్వ ఉద్యోగం కల్పించింది.
నేతలను, పదవులను కార్యకర్తల అభీష్టం మేరకే ఎంపిక చేస్తారు. గ్రామస్థాయి నుంచి రాష్ట్ర అధ్యక్షుడి వరకూ పార్టీ పదవులు, ప్రభుత్వంలోకి వస్తే.. అర్హులైన వారికి నామినేటెడ్ పదవుల ఎంపికలోనూ కార్యకర్తల అభీష్టానికే పెద్ద పీట వేస్తుంది తెలుగుదేశం పార్టీ. కష్టపడే కార్యకర్తను ఏకంగా పార్లమెంటు సభ్యుడిని చేసింది తెలుగుదేశం పార్టీ..దీనికి ఉదాహరణ విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు.
కుటుంబసభ్యులకు కష్టమొస్తే క్షణమైనా ఆలస్యం చేస్తారేమో కానీ.. కార్యకర్తకు కష్టమొస్తే.. ఆగమేఘాలపై స్పందించి ఆదుకునే టీముని రంగంలోకి దింపుతారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్., అధికారంలో వున్నా, లేకున్నా టీడీపీకి కార్యకర్తల సంక్షేమమే ముఖ్యం.పాల్వాయి గేటు పోలింగ్ బూత్లో వైసీపీ ముష్కరులకు ఎదురొడ్డి పోరాడిన నంబూరి శేషగిరిరావు ఇటీవల గుండెపోటుతో చనిపోయారు. వారి కుటుంబాన్ని ఇంటికి పిలిపించుకుని మరీ తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు లోకేష్..
దేశంలో ఏ పార్టీకి లేని కార్యకర్తల సంక్షేమ విభాగంని ఆరంభించి, తానే కన్వీనర్గా నారా లోకేష్ కార్యకర్తలను ఆదుకుంటున్నారు. విద్య, వైద్యం, వివాహం, బీమా ద్వారా సాయం.. ఉపాధికి ఆర్థిక ఆసరా అందిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వివిధ సమస్యలతో సాయం కోసం వచ్చిన 4178 మంది కార్యకర్తలకు ఇప్పటివరకూ కార్యకర్తల సంక్షేమ విభాగం రూ.14 కోట్లకుపైగానే ఆర్థికసాయం అందించింది.
తెలుగు రాష్ట్రాల్లో వేర్వేరు చోట్ల ప్రమాదాల్లో మరణించిన 5826 మంది కార్యకర్తల కుటుంబాలకు.. ప్రమాదబీమా కింద 133 కోట్ల 95 లక్షల రూపాయలు సాయం అందజేశారు. ప్రమాదాల్లో గాయపడిన వేలాది మంది కార్యకర్తల వైద్యానికి ఆర్థిక సాయం, కార్యకర్తల పిల్లల విద్యావసరాలకు ఆర్థిక సాయం అందించారు.












