- విషాదాన్నీ రాజకీయం చేయడం వారి నైజం
- లైసెన్స్ షాపులోనే శివశంకర్ మద్యం కొనుగోలు
- సీసీ ఫుటేజ్లో స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి
- బెల్టుషాపులో మద్యం అంటూ సాక్షి ఫేక్ ప్రచారం
- గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్
మంగళగిరి (చైతన్యరథం): వైసీపీ పార్టీ పూర్తిగా ఫేక్ ప్రచారాల కు కేరాఫ్ గా మారిందని.. అబద్ధాలను నిజాలుగా చూపించి, వాస్తవాలను దాచిపెట్టడం వైసీపీకి నిత్యకృత్యంగా మారిందని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ మండిపడ్డారు. ఆదివారం మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కర్నూలు జిల్లా పెద్ద టేకూరు సమీపంలో జరిగిన దుర్ఘటనలో 19 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోవడంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుం బాలకు ప్రభుత్వం తరపున అన్ని విధాలా సహాయం అందేలా చర్యలు ప్రారంభమయ్యాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు విదేశీ పర్యటనలో ఉన్నప్పటికీ ప్రమాద సమాచారం అందిన వెంటనే అధికారులను అప్రమత్తం చేసి సహాయక చర్యలు చేపట్టే విధంగా ఆదేశించారు. కానీ ఈ ఘటనను రాజకీయంగా వాడుకుంటూ ఫేక్ ప్రచారాలతో ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం వైసీపీ చేస్తున్న తీరు అత్యంత దురదృష్టకరం. వాస్తవాలను పూర్తిగా విస్మ రించి, సాక్షి వంటి ఇంటి వైసీపీ అనుబంధ మీడియా సంస్థలు బెల్ట్ షాప్లో మద్యం తాగి ప్రమాదం అనే అబద్దపు కథనాలు ప్రచారం చేయడం బాధాకరమని మండిపడ్డారు.
బెల్ట్ షాపులో కాదు.. ప్రభుత్వ లైసెన్స్ డ్ షాపులోనే..
ప్రమాదానికి కారణమైన వ్యక్తి శివశంకర్ రాత్రి 7 గంటలకు, 8:20 గంటలకు పెద్దటేకూరులోని లైసెన్స్ రేణుక ఎల్లమ్మ వైన్స్ షాప్ షాప్ మద్యం కొనుగోలు చేశాడు. ఈ విషయానికి సంబంధిం చిన సీసీ కెమెరా ఫుటేజ్ కూడా అందుబాటులో ఉంది. ప్రభుత్వం అనుమతి ఇచ్చిన లైసెన్స్ షాప్ ద్వారానే ఆ మద్యం అమ్ముడైంది. అది కల్తీ మద్యం కాదు.. ఇది ఎక్సైజ్ శాఖ అధికారులే తేల్చారు. అయినప్పటికీ వైసీపీ నేతలు బెల్ట్ షాప్లు, కల్తీ మద్యం పేరుతో అబద్దపు కథనాలు ప్రచారం చేస్తూ ప్రజలను గందరగోళానికి గురి చేస్తున్నారని మండిపడ్డారు.
ఫేక్ ప్రచారాలు చేయడం వైసీపీకి అలవాటు
విషాద ఘటనలను రాజకీయ లాభం కోసం వాడుకోవడం వైసీపీకి అలవాటుగా మారిపోయింది. తండ్రి వైఎస్ ప్రమాదం నుంచి వివేకా హత్య దాకా, అమరావతిపై చేసిన తప్పుడు ప్రచా రం నుంచి “పింక్ డైమండ్” కల్పిత కథల దాకా అంతా అబద్ద ప్రచారాలే వైసీపీ రాజకీయాల మూలం. ఈ ఘటనలో ప్రభుత్వం పారదర్శకంగా, వేగంగా స్పందించింది. బాధితులకు మెరుగైన వైద్యం అందించడమే కాకుండా, పునరావాస చర్యలు కూడా ప్రారంభమయ్యాయి. అయినా కూడా వైసీపీ సైకో సోషల్ మీడి యా బృందం అబద్దాల ఆధారంగా ప్రచారం చేస్తూ ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టే ప్రయత్నం చేస్తోంది. ప్రభుత్వం తీసుకున్న సురక్ష యాప్ ద్వారా ప్రతి మద్యం బాటిల్ ట్రాక్ చేయగలుగుతున్న విధానం ఈ ప్రభుత్వం ప్రజల ప్రాణ భద్రత పట్ల చూపుతున్న నిబద్ధతకు నిదర్శనం. కానీ గతంలో వైసీపీ పాలనలో కల్తీ మద్యం వల్ల 30,000 మంది ప్రాణాలు కోల్పోయినప్పుడు ఈరోజు ఫేక్ ప్రచారం చేసే నాయకులు ఎక్కడ ఉన్నారు? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటి దుర్ఘటనలపై అబద్ధపు ప్రచారం చేయడం, రాజకీయ లాభం కోసం ప్రజల ప్రాణాలను వాడుకోవడం ఎప్పటికీ సమంజసం కాదని స్పష్టం చేశారు. అలాగే ఫేక్ ప్రచారాలను నమ్మొద్దని, వైసీపీ ఎన్ని కుట్రలు చేసినా నిజం ఎప్పుడూ వెలుగు లోనే ఉంటుందని హితవుపలికారు.














