- విద్యుత్, తాగునీటికి అంతరాయం లేకుండా చూడాలి
- తీర ప్రాంత వాసులను పునరావాస కేంద్రాలకు పంపాలి
- వ్యవసాయ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆదేశం
మన్యం/పార్వతీపురం(చైతన్యరథం): మొంథా తుఫాన్ జిల్లాపై తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉండటంతో వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అధికార యంత్రాంగాన్ని అప్ర మత్తం చేశారు. ఈ నెల 27, 28, 29 తేదీల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు, తీవ్రమైన గాలులు వీస్తాయని వాతావరణ శాఖ జారీ చేసిన హెచ్చరికల నేపథ్యంలో ఆదివారం జిల్లా కలెక్టర్, ఎస్పీ లు, ఇతర శాఖల అధికారులతో ఫోన్లో మాట్లాడారు. వాయు గుండం 28న ఉదయం నాటికి తీవ్రమైన తుఫానుగా మారు తుందని, ఈ సమయంలో ఎక్కడా ఎటువంటి ప్రాణ-ఆస్తి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశిం చారు. ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేసేలా సమాచార వ్యవస్థలు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయివరకు తుఫాన్ ప్రభావంపై సమాచారం వేగంగా చేర వేసి నష్ట నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు.
ఎన్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఇప్పటికే తీర ప్రాంతాలకు చేరుకుని జిల్లా ల్లోని తుఫాన్ ప్రభావాన్ని పర్యవేక్షణ చేసి ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. రిజర్వాయర్లు, ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో నీటిమట్టాలను నిరంతరం పర్యవేక్షించి అందుకు అనుగుణంగా కార్యాచరణ అమలు చేయాలని స్పష్టం చేశారు. ప్రతి శాఖ, ప్రతి విభాగం సమన్వయంతో పనిచేయాలని అధికారులను నిర్దేశించా రు. చెరువులు, కాలువ గట్లు కోతకు గురైతే తక్షణం మరమ్మతులు చేసేలా సిద్ధంగా ఉండాలన్నారు. చెట్లు కూలిపోయినా, కొమ్మలు విరిగిపడినా వాటిని తొలగించడానికి అవసరమైన ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. వైద్య, ఆరోగ్య శాఖ అధికారు లు ప్రజలకు అందుబాటులో ఉండాలని, నీటి సరఫరా విభాగం అధికారులు ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా చూడా లని ఆదేశించారు.














