- విద్యార్థులను భవిష్యత్ నైపుణ్యాలకు సిద్ధం చేసేందుకు లీప్ విధానం
- మెల్‌బోర్న్ ఎడ్యుకేషన్ రౌండ్ టేబుల్ సమావేశంలో మంత్రి లోకేష్
మెల్‌బోర్న్/ఆస్ట్రేలియా (చైతన్యరథం): ఆంధ్రప్రదేశ్‌లో 2029 నాటికి ప్రపంచస్థాయి విద్యా వ్యవస్థను తయారుచేయడమే లక్ష్యంగా పలు విప్లవాత్మక సంస్కరణలు చేపట్టామని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఆస్ట్రేలియా పర్యటనలో ఆరో రోజు శుక్రవారం ఆస్ట్రేలియా ట్రేడ్ అండ్ ఇన్వెస్టిమెంట్ కమిషన్ (Aర్‌తీaసవ) ఆధ్వర్యాన మెల్‌బోర్న్‌లో నిర్వహించిన ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ రౌండ్ టేబుల్ సమావేశానికి మంత్రి లోకేష్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సమావేశంలో స్టడీ మెల్‌బోర్న్, విక్టోరియన్ ఎడ్యుకేషన్, స్కిల్ ఇనిస్టిట్యూషన్స్ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ… విద్యార్థుల్లో అభ్యసన ఫలితాలను మెరుగుపర్చడమే లక్ష్యంగా లెర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ (ూజుAూ) కార్యక్రమాన్ని ఈ ఏడాది నుంచే అమలు చేస్తున్నామని తెలిపారు. మేం అమలు చేస్తున్న లీప్ కార్యక్రమం విద్యారంగంలో కొత్త తరానికి మార్గదర్శకత్వం వహిస్తోంది. అంతర్జాతీయస్థాయి ఉత్తమ బోధనా పద్ధతుల ద్వారా విద్యార్థుల సమగ్రాభివృద్ధికి కృషిచేస్తున్నామని మంత్రి లోకేష్ వివరించారు.
భవిష్యత్ నైపుణ్యాలు, డిజిటల్ ఎడ్యుకేషన్..
21వ శతాబ్దపు నైపుణ్యాలకు విద్యార్థులను సన్నద్ధం చేయడమే మా లక్ష్యం. సాంప్రదాయ విధానాలకు స్వస్తి చెబుతూ… ఆట ఆధారిత పాఠ్యాంశాలు, ఏఐ ఆధారిత పరిష్కారాలతో బోధనా శిక్షణ, ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసీ (ఖీూచీ) వంటి వినూత్న కార్యక్రమాలను లీప్ ప్రోగ్రామ్‌లో అమలు చేస్తున్నాం. ఏఐ, ఇతర అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాల ద్వారా విద్యార్థులను టెక్నికల్, లీడర్ షిప్, రియల్ లైఫ్ నైపుణ్యాలతో సన్నద్ధం చేయడానికి ఫలితాల ఆధారిత విధానం అమలుకు శ్రీకారం చుట్టాం. కొత్త విధానంలో అంతర్భాగంగా చీజుూ 2020 లక్ష్యాలకు అనుగుణంగా సవరించిన పాఠ్యాంశాలు, భవిష్యత్ నైపుణ్యాలు, డిజిటల్ ఎడ్యుకేషన్ ద్వారా సమగ్ర అభ్యాసం ఉన్నాయని చెప్పారు. అన్ని స్థాయిల్లో నైతిక విలువలకు పెద్దపీట వేస్తూ ప్రత్యేకంగా పాఠ్యాంశాలు ప్రవేశపెట్టామని మంత్రి లోకేష్ తెలిపారు.
అంతర్జాతీయ విద్యార్థులకు గమ్యస్థానంగా..
స్టడీ మెల్‌బోర్న్ ప్రతినిధులు మాట్లాడుతూ… ప్రతి ఏటా 170 దేశాల నుంచి 1.75 లక్షల మందికి పైగా అంతర్జాతీయ విద్యార్థులు విద్యాభ్యాసం కోసం విక్టోరియా వస్తున్నారని తెలిపారు. ముఖ్యంగా చైనా, భారత్, వియత్నాం, నేపాల్ నుంచి పెద్దసంఖ్యలో విద్యార్థులు వస్తున్నట్లు చెప్పారు. వీరిద్వారా విక్టోరియా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు 12.6 బిలియన్ డాలర్ల ఆదాయం లభిస్తుందన్నారు. ఆస్ట్రేలియాలో పోస్ట్ స్టడీ పని అవకాశాలను కోరుకునే విద్యార్థులకు విక్టోరియా గమ్యస్థానంగా ఉందని తెలిపారు. ఆవిష్కరణ, పరిశోధన, సృజనాత్మకతలకు పెద్దపీట వేస్తూ… విక్టోరియాలో చదువుతో పాటు స్కాలర్ షిప్‌లు, పని అవకాశాలు వంటి ప్రోత్సాహకాలు అందిస్తున్నామని చెప్పారు. ఆస్ట్రేలియా అంతర్జాతీయ విద్యార్థులకు విక్టోరియా నెం.1 గమ్యస్థానంగా ఉంది. హైక్వాలిటీ ఎడ్యుకేషన్, కల్చరల్ డైవర్సిటీ, ఉత్సాహభరితమైన జీవనశైలి తమ ప్రత్యేకతలని తెలిపారు. వరల్డ్ మోస్ట్ లివబుల్ సిటీల్లో మెల్ బోర్న్ నెం.1 ర్యాంకు సాధించిందని స్టడీ మెల్‌బోర్న్ ప్రతినిధులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మెల్‌బోర్న్ యూనివర్సిటీ, మోనాష్ యూనివర్సిటీ, స్విన్ బర్న్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ, ఆర్‌ఎంఐటీ యూనివర్సిటీ ప్రతినిధులు పాల్గొన్నారు.










