- మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపిన మంత్రి
- క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశం
అమరావతి (చైతన్యరథం): కర్నూలు జిల్లా కల్లూరు మండలం చిన్నటేకూరు వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో బస్సు దగ్ధమై పలువురు ప్రయాణికులు మృతిచెందడం పట్ల విద్య, ఐటీశాఖల మంత్రి నారా లోకేష్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగి పలువురు ప్రయాణికులు ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరం అన్నారు. ప్రమాద ఘటన తరువాత ప్రభుత్వం అన్ని రకాల సహయక చర్యలను చేపట్టిందన్నారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించామన్నారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రారిస్తూ, మృతుల కుటుంబ సభ్యులకు మంత్రి లోకేష్ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.










