యుఏఈ పర్యటనలో భాగంగా దుబాయ్ ఫ్యూచర్ మ్యూజియంను మంత్రులు, అధికారులతో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సందర్శించారు. దుబాయ్ దీన్ని లివింగ్ మ్యూజింగ్‌గా రూపొందిస్తోంది. అంతరిక్షం, వాతావరణం, ఆరోగ్యం, విద్య, వైద్యం, ఏఐవంటి రంగాల్లో భవిష్యత్ ఆవిష్కరణలు ఏవిధంగా ఉండబోతున్నాయనేది టెక్నాలజీని ఉపయోగించి మ్యూజియంలో ప్రదర్శనలు చేస్తున్నట్టు అక్కడి అధికారులు ముఖ్యమంత్రి చంద్రబాబు బృందానికి వివరించారు. ఫ్యూచర్ జర్నీ పేరిట ఏర్పాటు చేసిన ఎక్సీపీరియన్స్ జోన్‌ను సీఎం చంద్రబాబు సందర్శించారు.










