- బాధ్యులపై చట్టపరంగా చర్యలు
- రాళ్లపాడు హత్యపై నెల్లూరు ఎస్పీ
నెల్లూరు (చైతన్యరథం): ఇద్దరు వ్యక్తుల మధ్య వివాదం, ఆర్థికపరమైన కారణాలతో జరిగిన హత్యను కులాలకు ముడిపెడుతూ తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని నెల్లూరు జిల్లా ఎస్పీ అజితా వేజెండ్ల స్పష్టం చేశారు. నెల్లూరు జిల్లా గుడ్లూరు మండలం రాళ్లపాడు హత్య ఘటనకు సంబంధించి జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని ఆమె తీవ్రంగా ఖండిరచారు. వ్యక్తిగత కక్షలతో జరిగిన హత్యను కులాలకు ముడిపెట్టడం పై ఎస్పీ తీవ్రంగా స్పందించారు. తప్పుడు ప్రచారం చేసే వారిపై కేసులు పెడతామని హెచ్చరించారు. ఇప్పటికే హత్య ఘటనలో నిందితులు హరిశ్చంద్ర ప్రసాద్, మాధవ రావులను అరెస్టు చేసి జైలుకు పంపినట్టు వెల్లడిరచారు. ఇరువురి మధ్య వ్యక్తిగత కారణాలతో పాటు ఆర్థికపరమైన లావాదేవీలు ఈ హత్యకు కారణమని తెలిపారు. వాస్తవాలను కప్పిపెట్టి కులాలకు ముడిపెట్టి రెచ్చగొట్టే విధంగా ప్రభుత్వం పై దుష్ప్రచారం చేయడాన్ని సీరియస్‌గా తీవ్రంగా పరిగణిస్తున్నామని స్పష్టం చేశారు. అలాంటి వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిందితులను జైలుకు పంపిన తర్వాత కూడా వైషమ్యాలు పెంచేలా కొందరు వ్యవహరించడం సరికాదన్నారు. దుష్ప్రచారం చేస్తున్న వ్యక్తులు, సామాజిక మాధ్యమాల పై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఫేక్ వీడియోలు సృష్టించిన వారిపై కేసులు నమోదు చేస్తున్నమని వెల్లడిరచారు.