కర్నూలు (చైతన్య రథం): కర్నూలులో ‘సూపర్ జిఎస్టీ -సూపర్ సేవింగ్స్’ జరుపుకున్న శుభ సందర్భంలో
దాదాపు రూ.13,430 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధాని నరేంద్ర మోదీ శ్రీకారం చుట్టడం ఆనందంగా ఉందంటూ సీఎం చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. కేంద్ర ప్రాజెక్టులకు మోదీ శ్రీకారం చుట్టిన అనంతరం ఎక్స్ వేదికపై సీఎం చంద్రబాబు పోస్టు పెడుతూ.. “ప్రాజెక్టుల శ్రీకారంతో ఏపీ ప్రజలకు, ముఖ్యంగా రాయలసీమ ప్రజలకు రెట్టింపు ఆనందాన్ని కలిగించిన రోజు. పరిశ్రమ, విద్యుత్, రోడ్లు, రైల్వేలు, రక్షణ తయారీ, పెట్రోలియం, సహజ వాయువువంటి రంగాలకు చెందిన ప్రాజెక్టులు మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడంలో, పారిశ్రామిక వృద్ధిని ముందుకు తీసుకెళ్లడంలో, రాష్ట్రవ్యాప్తంగా సమతుల ఆర్థికాభివృద్ధిని ప్రోత్సహించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఈ కీలక కార్యక్రమాలకు పునాది వేసినందుకు, ఈరోజు ఆంధ్రప్రదేశ్ను తన ఉనికితో అలంకరించినందుకు ప్రధాని నరేంద్రమోదీజీకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు” అని పేర్కొన్నారు.