అమరావతి (చైతన్య రథం): భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా ఆ మహనీయుని స్మృతికి విద్య, ఐటీ మంత్రి నారా లోకేష్ ఘన నివాళి ప్రకటించారు. ఈమేరకు ఎక్స్ వేదికపై పోస్టు పెడుతూ.. ‘‘సామాన్య కుటుంబంనుంచి దేశం గర్వించదగిన శాస్త్రవేత్తగా ఎదిగారు. ‘మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా’గా కీర్తి గడిరచారు. రాష్ట్రపతి పదవికే వన్నె తీసుకువచ్చిన అబ్దుల్ కలాం.. తన ప్రసంగాలతో యువతలో స్ఫూర్తి నింపారు. అబ్దుల్ కలాం జయంతిని ప్రపంచ విద్యార్థుల దినోత్సవంగా జరుపుకోవడం మనందరికీ గర్వకారణం. ఎందరికో ఆదర్శంగా నిలిచిన అబ్దుల్ కలాం సేవలను ఈ సందర్భంగా స్మరించుకుందాం’’ అంటూ నారా లోకేష్ పేర్కొన్నారు.