- విశాఖను ట్రిలియన్ డాలర్ ఎకానమీగా తీర్చిదిద్దాలనేదే లక్ష్యం
- 10 లక్షల కోట్ల పెట్టుబడుల్లో సగం విశాఖ రీజియన్కి వస్తున్నాయి
- ఇందుకు కావాల్సిన మౌలిక సదుపాయల కల్పనపై దృష్టిపెడతాం
- టీసీఎస్, కాగ్నిజెంట్లకు 99 పైసలకే భూకేటాయింపు తప్పా?
- మీడియా సమావేశంలో ప్రశ్నించిన మంత్రి నారా లోకేశ్
విశాఖపట్నం (చైతన్య రథం): విశాఖకు పెద్దఎత్తున పెట్టుబడులు వస్తోన్న నేపథ్యంలో విశాఖ ఎకనామిక్ రీజియన్ను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని విద్య, ఐటీ మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. విశాఖ రీజియన్లో కల్పించాల్సిన మౌలిక సదుపాయాలు, ఎకో సిస్టమ్పై ఉత్తరాంధ్ర జిల్లాల కలెక్టర్లు, ప్రజాప్రతినిధులతో విశాఖ కలెక్టర్ కార్యాలయంలో మంత్రి సమీక్షించారు. అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. “విశాఖలో సిఫీ ఆధ్వర్యంలో డేటా సెంటర్కు శంకుస్థాపన చేశాం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విశాఖలో పెట్టుబడులు, అభివృద్ధి విషయంలో వేగంగా పరిగెడుతున్నాం. టీసీఎస్, కాగ్నిజెంట్ విషయంలో ఇప్పటికే కమిట్మెంట్ అయింది. ఏఎన్ఎస్ఆర్ సత్వా, యాక్సెంచర్, గూగుల్, సిఫీ, ఆర్సెల్లర్ మిట్టల్తోపాటు ఫార్మాలో సుమారు 5 కంపెనీలు పెట్టుబడులు పెట్టనున్నాయి. సుమారు 10 లక్షల కోట్ల పెట్టుబడులకు మేం ఒప్పందాలు చేసుకున్నాం. ఇందులో 50 శాతం గ్రేటర్ విశాఖ ఎకనామిక్ రీజియన్కు వస్తున్నాయి. అభివృద్ధి పట్ల ప్రజా ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి ఇది నిదర్శనం. అన్ని ప్రాంతాలను సమగ్రంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం” అని స్పష్టం చేశారు.
విశాఖ ఎకనామిక్ రీజియన్ ను బలోపేతం చేయాలి
“సీఐఐ భాగస్వామ్య సదస్సును నవంబర్ 14, 15ల్లో విశాఖలో నిర్వహిస్తున్నాం. ఇందుకు కావాల్సిన ఏర్పాట్లు చేస్తున్నాం. రాబోయే రోజుల్లో విశాఖకు, ఏపీకి పెద్ద ప్రకటనలు వస్తాయి. అందులో ఎలాంటి సందేహం లేదు. విశాఖ ఎకనామిక్ రీజియనన్ను బలోపేతం చేయాలి. ఏపీ 2.4 ట్రిలియన్ డాలర్ ఎకానమీ అవ్వాలంటే అందులో గ్రేటర్ విశాఖ రీజియన్ కనీసం 1 ట్రిలియన్ డాలర్ ఎకానమీ అవ్వాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం. మేం ప్యాలెస్లు కట్టేందుకు విశాఖకు రాలేదు. ప్రజలకు ఉద్యోగాలు, ఉపాధి కల్పించేలా పెట్టుబడులు తీసుకురావాలి, వాటిని గ్రౌండ్ చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం” అని మంత్రి లోకేశ్ చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం” అని స్పష్టం చేశారు.
విశాఖ ఎకనామిక్ రీజియన్ ను బలోపేతం చేయాలి
“సీఐఐ భాగస్వామ్య సదస్సును నవంబర్ 14, 15ల్లో విశాఖలో నిర్వహిస్తున్నాం. ఇందుకు కావాల్సిన ఏర్పాట్లు చేస్తున్నాం. రాబోయే రోజుల్లో విశాఖకు, ఏపీకి పెద్ద ప్రకటనలు వస్తాయి. అందులో ఎలాంటి సందేహం లేదు. విశాఖ ఎకనామిక్ రీజియనన్ను బలోపేతం చేయాలి. ఏపీ 2.4 ట్రిలియన్ డాలర్ ఎకానమీ అవ్వాలంటే అందులో గ్రేటర్ విశాఖ రీజియన్ కనీసం 1 ట్రిలియన్ డాలర్ ఎకానమీ అవ్వాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం. మేం ప్యాలెస్లు కట్టేందుకు విశాఖకు రాలేదు. ప్రజలకు ఉద్యోగాలు, ఉపాధి కల్పించేలా పెట్టుబడులు తీసుకురావాలి, వాటిని గ్రౌండ్ చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం” అని మంత్రి లోకేశ్
వైసీపీ ఐదేళ్లలో తీసుకురాలేని పరిశ్రమలను 16 నెలల్లోనే తెచ్చాం
“నవంబర్లో టీసీఎస్ సంస్థ ప్రారంభం కానుంది. కాగ్నిజెంట్ సీఈవో కూడా నవంబర్ లో వస్తున్నారు. వారి కొత్త ప్రాజెక్ట్కు శంకుస్థాపన చేస్తున్నాం. డిసెంబర్లో వారి డెవలప్మెంట్ సెంటర్ కూడా ప్రారంభించబోతున్నారు. గూగుల్ విషయానికి వస్తే రేపు ఢిల్లీకి వెళ్లి పెద్దఎత్తున ప్రకటన చేయబోతున్నాం. 99 పైసలకే ఎకరా భూమి కేటాయిస్తున్నారని నాపై ఆరోపణలు చేస్తున్నారు. టీసీఎస్, కాగ్నిజెంట్కు 99 పైసలకే భూమి ఇవ్వడం తప్పా అని నేను వారిని సూటిగా ప్రశ్నిస్తున్నాను. వైసీపీ ఐదేళ్లలో తీసుకురాలేని పరిశ్రమలను మేం 16 నెలల్లోనే తీసుకువచ్చాం. అది మా చిత్తశుద్ది. ప్రతి సంస్థను మేం గ్రౌండ్ చేస్తాం. నాలుగు జిల్లాల కలెక్టర్లతో సమీక్షించాం. గ్రేటర్ ఎకనామిక్ రీజియన్కు కావాల్సిన ఎకో సిస్టమ్పై చర్చించాం. రోడ్లు, ప్రభుత్వ భూముల వివరాలపై చర్చించాం” అని లోకేశ్ పేర్కొన్నారు.
“విశాఖలో రాబోయే ఐదేళ్లలో ఐటీ రంగంలో ఐదు లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం. ఇది చేయాలంటే సమగ్ర ప్రణాళిక అవసరం. ఆ దిశగా మేం పనిచేస్తున్నాం. ఒకే రాష్ట్రం- ఒకే రాజధాని.. అభివృద్ధి వికేంద్రీకరణ నినాదంతో నాడు మీ ముందుకు వచ్చాం. 94 శాతం సీట్లతో మమ్మల్ని గెలిపించారు. దానిని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మాపై ఉంది. అభివృద్ధి, సంక్షేమాన్ని జోడెద్దుల బండిలా ముందుకు తీసుకెళ్తాం. అన్ని ప్రాంతాలను సమగ్రంగా అభివృద్ధి చేసి యువతకు పెద్దఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. వైసీపీ అరాచకాలను ప్రజల ముందు ఎండగడతాం. నకిలీ మద్యం విషయంలో కూడా చాలా పెద్ద తతంగం ఉంది. హెూంవర్క్ జరుగుతోంది. ప్రజాకోర్టులో వారిని దోషిగా నిలబెడతాం” అని మంత్రి లోకేశ్ హెచ్చరించారు.