ముంబయి (చైతన్యరథం): విశాఖలో మైండ్ స్పేస్ బిజినెస్ పార్క్ ఏర్పాటు చేయాలని ప్రఖ్యాత రహేజా గ్రూప్నకు రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ విజ్ఞప్తిచేశారు. రహేజా గ్రూప్ ప్రెసిడెంట్ నీల్ రహేజా తో ముంబయిలో సోమవారం మంత్రి
లోకేష్ భేటీ అయ్యారు. రెసిడెన్షియల్, కమర్షియల్ రియల్ ఎస్టేట్, హాస్పిటాలిటీ, రిటైల్ మాల్స్, రిటైల్స్ స్టోర్స్, ఐటీ సెజ్లకు పవర్ డిస్ట్రిబ్యూషన్ వ్యాపార రంగంలో పేరెన్నికగన్న రహేజా గ్రూప్ 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ. 12 వేల కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. రహేజా గ్రూప్నకు చెందిన 3 లిస్టెడ్ ఎన్టైటిల్స్ మార్కెట్ క్యాపిటల్ రూ.100 బిలియన్లకు పైగా ఉంది. భారత్లో 54 మిలియన్ చదరపు అడుగుల గ్రేడ్-ఏ ఆఫీస్ స్పేస్ను అభివృద్ధి చేసిన రహేజా గ్రూప్ దేశంలో 2వ అతిపెద్ద కమర్షియల్ స్పేస్ డెవలపర్ గా నిలచింది. నీల్ రహేజాతో భేటీలో మంత్రి లోకేష్ మాట్లాడుతూ… విశాఖపట్నంలో 100-150 ఎకరాల విస్తీర్ణంలో 100 మిలియన్ చదరపు అడుగుల గ్రేడ్- ఏ కార్యాలయ స్థలంతో మైండ్స్పేస్ బిజినెస్ పార్స్ను అభివృద్ధి చేయాలని కోరారు. రహేజా గ్రూప్-ప్రిన్స్ టన్ డిజిటల్ గ్రూప్ భాగస్వామ్యాన్ని ఉపయోగించి దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద డేటా సెంటర్ హబ్ను (హైపర్స్కేల్ డేటా సెంటర్ క్యాంపస్) ఏర్పాటు చేయండి.
ఆంధ్రప్రదేశ్ పునరుత్పత్తి శక్తి సమృద్ధిగా ఉండటం, తీర ప్రాంత కనెక్టివిటీ (సబ్మెరైన్ కేబుల్స్ కోసం), రాయితీతో పరిశ్రమలకు అవసరమైన భూమి లభ్యత వంటి ప్రత్యేక ప్రయోజనాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందిస్తోంది. అమరావతి రాజధానికి సేవలందించే విధంగా 5 స్టార్ బిజినెస్ హెూటల్ (వెస్టిన్ / జీఔ మారియట్)ను అమరావతిలో ఏర్పాటుచేయండి. విశాఖపట్నంలో వ్యాపార, వినోద విభాగాలను లక్ష్యంగా బీచ్ రిసార్ట్ ప్రాపర్టీ రిటైల్ అండ్ మాల్ నెట్వర్క్ ఏర్పాటుపై దృష్టిసారించండి. ప్రస్తుతం విశాఖలో నిర్మాణంలో ఉన్న ఇనార్బిట్ మాల్ను త్వరగా పూర్తిచేసి, విజయవాడ, అమరావతిలో అదే తరహా మాల్స్ అభివృద్ధి చేయండి. వేగంగా అభివృద్ధి చెందుతున్న ఏపీలోని 8-10 నగరాల్లో షాపర్స్ స్టాప్ రిటైల్ స్టోర్లను విస్తరించండి. అమరావతి రాజధాని ప్రాంతంలో ప్రీమియం అపార్ట్మెంట్ ప్రాజెక్టులను (రహేజా హెూమ్స్) ప్రారంభించాలని మంత్రి లోకేష్ కోరారు.