- ఆ అర్హత ఆయనకు లేదు
- జే బ్రాండ్స్తో వేలాది ప్రాణాలు తీశారు
- ఇప్పుడు కల్తీ మద్యం తయారీదారులను పట్టుకున్నదే మా ప్రభుత్వం
- నిందితుల్లో టీడీపీ వారున్నా అరెస్ట్ చేయించి, పార్టీ నుంచి సస్పెండ్ చేయించాం
కల్తీ మద్యంపై విమర్శించే అర్హత వైసీపీ అధినేత జగన్కు ఎక్కడుందని విద్య, ఐటీశాఖల మంత్రి నారా లోకేష్ ప్రశ్నించారు. కల్తీ మద్యం తయారీదారులను పట్టుకున్నదే తమ ప్రభుత్వం అన్నారు. నిందితుల్లో టీడీపీ నేతలున్నా అరెస్ట్ చేయించింది మా ప్రభుత్వం. నిందితుల్లో ఇద్దరు మా పార్టీ వారుంటే తక్షణమే వారిని తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెండ్ చేశారు మా అధ్యక్షుడు. జగన్ ఐదేళ్ల పాలనలో ఏం చేశారో మరిచిపోయి ఆరోపణలు చేయొద్దు. డబ్బు కక్కుర్తితో జే బ్రాండ్స్ వేల మంది ప్రజల ప్రాణాలు తీశారు. మీ జమానాలో జంగారెడ్డి గూడెంలో కల్తీ మద్యం తాగి ప్రజలు చనిపోతే, సహజమరణాలని నిందితులను కాపాడే ప్రయత్నం చేశారు. పోతే పోయారు… ఇంకా
ఏడుస్తారేంటి.. అంటూ మీ ప్రభుత్వంలో మంత్రి జోగి రమేష్ అహంకారపు మాటలను ప్రజలు ఇప్పటికీ మరిచిపోలేదు. దళితుడైన
డ్రైవర్ సుబ్రహ్మణ్యంని చంపి డెఙ్బాడీ డోర్ డెలివరీ చేసిన వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుని అప్పటి నుంచి ఇప్పటివరకూ పార్టీ నుంచి కనీసం సస్పెండ్ కూడా చేయలేదు సరికదా.. ఇంటికి పిలిపించుకుని భోజనం పెట్టి సన్మానించారు. కల్తీ మద్యం గురించి, నిందితులకు వత్తాసు పలకడం గురించి మాట్లాడే అర్హత మీకు ఎక్కడుంది జగన్ అని ఎక్స్లో మంత్రి లోకేష్ మండిపడ్డారు.