ముంబయి (చైతన్యరథం): ఏపీలో 3-డీ ప్రింటింగ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేయాలని ప్రఖ్యాత హెచ్పీ ఇన్క్ సంస్థను రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ కోరారు. హెచ్పీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అండ్ ఎండీ (భారత్, బంగ్లాదేశ్, శ్రీలంక) ఇప్సితా దాస్ గుప్తాతో మంత్రి నారా లోకేష్ ముంబయిలో సోమవారం భేటీ అయ్యారు. ప్రపంచవ్యాప్తంగా 170 దేశాల్లో పర్సనల్ కంప్యూటింగ్, ప్రింటింగ్ సొల్యూషన్స్, హైబ్రిడ్ వర్క్ సొల్యూషన్స్ అండ్ గేమింగ్ వాణిజ్య కార్యకలాపాలు నిర్వహిస్తున్న హెచ్పీ 3. (HP Inc.) 2024-25 సంవత్సరంలో 53.6 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని ఆర్జించింది. భారత్లో రూ.17వేల కోట్ల రూపాయలకు పైగా వ్యాపారం చేసిన హెచ్పీ సంస్థ… ఐటీ హార్డ్ వేర్ పీఎస్ఐ స్కీమ్ కింద లబ్ధిపొందిన 27సంస్థల్లో ఒకటిగా నిలచింది. ఈ సందర్భంగా ఇప్సితా దాస్ గుప్తాతో మంత్రి లోకేష్ మాట్లాడుతూ… ఏపీలో 3 డీ ప్రింటింగ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేయాల్సిందిగా విజ్ఞప్తిచేశారు.
2019లో HP Inc. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో భాగస్వామ్యం చేసి 3 డీ ప్రింటింగ్ కోసం ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (CoE) ఏర్పాటుకు ముందుకు వచ్చింది. అయితే ఆ తర్వాత పరిణామాల్లో అది కార్యరూపం దాల్చలేదు. ప్రస్తుతం ఏపీలో కూటమి ప్రభుత్వం ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ విధానాలు అమలుచేస్తున్న నేపథ్యంలో తక్షణమే ఏపీలో సెంటర్ ఆఫ్ క్సలెన్స్ను ఏర్పాటు చేయాల్సిందిగా ఏపీ ప్రభుత్వం ఆహ్వానిస్తోంది. ఇందుకు అవసరమైన అన్ని వసతులను కల్పించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇటీవలి కాలంలో డిక్సన్ కలిసి భారతదేశంలో తన ఉత్పత్తిని HP రెట్టింపు చేస్తోంది. ఆంధ్రప్రదేశ్లో ఎలక్ట్రానిక్స్ మాన్యుఫాక్చరింగ్ పాలసీ 4.0 కింద PCలు, ల్యాప్టాప్లు, వర్క్స్టేషన్ సెంబ్లింగ్ (ప్రతి సంవత్సరం 5 లక్షల నుండి 10 లక్షల యూనిట్లు సామర్థ్యంతో), HP మాన్యుఫాక్చరింగ్ యూనిట్ను నెలకొల్పండి.
ఎలక్ట్రానిక్ హబ్గా అభివృద్ధి చెందుతున్న తిరుపతిలో పీసీ కాంపోనెంట్ మాన్యుఫాక్చరింగ్ పార్లను (మదర్బర్డులు, డిస్ ప్లేలు, బ్యాటరీలు, ఛార్జర్లు) అభివృద్ధి చేయండి. అలాగే HP సప్లై చైన్ (Foxconn, Quanta, Inventec) ఆంధ్రప్రదేశ్కి రప్పించేలా సహకారం అందించండి. సెమీకండక్టర్ పాలసీ లింకేజీలతో కూడిన సమగ్ర క్లస్టర్ ఏర్పాటులో భాగస్వామ్యం
వహించండి. పూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత కంప్యూటింగ్ (Omni (బ్రాండ్ అభివృది). సస్టయినబుల్ ప్యాకేజింగ్ సొల్యూషన్లలో భారత మార్కెట్కు అనుగుణంగా స్థానిక ఉత్పత్తుల అభివృద్ధిపై దృష్టి సారించండి. విశాఖపట్నం లేదా అమరావతిలో R&D సెంటరు ఏర్పాటుచేయాల్సిందిగా మంత్రి లోకేష్ విజ్ఞప్తిచేశారు.