- డబుల్ ఇంజిన్ సర్కార్తో డబుల్ బెనిఫిట్స్
- విశాఖ స్టీల్ ప్లాంట్, ఐటీ హబ్ బలోపేతం
- టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు
గాజువాక (చైతన్యరథం): ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు జీఎస్టీ 2.0 ప్రకటించడం చారి త్రాత్మక పరిణామమని, ఇది దేశంలో ఆర్థిక పెనుమార్పుకు, ప్రజల జీవన ప్రమాణాల పెరుగుదలకు దోహదపడుతుందని రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు తెలిపారు. గాజువాకలో నిర్వహించిన ర్యాలీలో పల్లా మాట్లాడు తూ జీఎస్టీ 2.0 దేశంలో ప్రతి ఇంటికి ఆర్థిక సౌలభ్యాలను తీసుకువస్తూ దసరా, దీపావళి పర్వదినాల్లో ప్రజలకు నిజమైన పండుగ తెచ్చింది. ఏపీలో స్థిర, సంకల్ప పాలన, కేంద్ర ప్రభు త్వం తీసుకున్న నిర్ణయాలతో డబుల్ ఇంజిన్ సర్కార్ ప్రజలకు డబుల్ బెనిఫిట్స్ అందిస్తుందని కొనియాడారు. కొత్త జీఎస్టీ సంస్కరణల వల్ల వాహనాల కొనుగోళ్లు ఊపందుకున్నాయి. కార్లు, బైకులు ధరలు తగ్గుముఖం పడడంతో సేల్స్ గణనీ యంగా పెరిగాయి. కేంద్ర పాలనలో దేశం ఆర్థిక, సైనిక శక్తిగా ఎదుగుతున్న సమయంలో స్వదేశీ వస్తువులను ప్రాధాన్యం ఇవ్వ డం అత్యంత అవసరమని అన్నారు. జీఎస్టీ 2.0 ద్వారా పేద, మధ్యతరగతి ప్రజలు, రైతులు, విద్యార్థులు నేరుగా లబ్ధి పొందు తారని తెలిపారు. నిత్యావసర వస్తువులు, వైద్యం, విద్య, వ్యవసా య పరికరాలపై రేట్లు తగ్గించడం, ప్రాణాధార ఔషధాలపై పన్ను రద్దు, ఇతర మందులపై 5 శాతం రేటు విధించడం, విద్యపై జీఎస్టీ పూర్తిగా రద్దు వల్ల ప్రజల భవిష్యత్తుకు భరోసా అందిస్తోందని అన్నారు.
డబుల్ ఇంజిన్ సర్కార్ వల్ల విశాఖ స్టీల్ ప్లాంట్ అభివృద్ధి కోసం కేంద్రం, రాష్ట్రం కలసి పనిచేస్తున్నా మని. రూ.14,000 కోట్ల రివైవల్ ప్యాకేజీ సాధించడం, అందులో ఇప్పటికే రూ.9,500 కోట్లు జమ కావడం, ఉత్పత్తి పెరగడం వలన స్టీల్ ప్లాంట్ పునరుద్ధరణకు బలమైన పునాది వేసింది. ఇది రాష్ట్రం ఆర్థికంగా బలోపేతానికి, ఉద్యోగ అవకాశాలు, పరిశ్రమల అభివృద్ధికి కీలకంగా మారిందని చెప్పారు. విశాఖ పట్నం నగరాన్ని అభివృద్ధి చేసే దిశగా ముఖ్యమంత్రి చంద్రబా బు నాయకత్వంలో, ఐటీ మంత్రి నారా లోకేష్ కృషితో విశాఖ తూర్పు తీరంలో అతిపెద్ద ఐటీ హబ్ మారబోతోందని పేర్కొన్నారు. టీసీఎస్, గూగుల్, కాగ్నిజెంట్, యాక్సెంచర్ వంటి దిగ్గజ కంపెనీలు రాష్ట్రానికి వచ్చి, ఆంధ్రప్రదేశ్ను గ్లోబల్ మ్యాప్లో నిలబెట్టాయని తెలిపారు. డబుల్ ఇంజిన్ సర్కార్ వల్ల జీఎస్టీ 2.0, విశాఖ స్టీల్ ప్లాంట్ పునరుద్ధరణ, ఐటీ హబ్ ఈ విధంగా ప్రజలకు డబుల్ బెనిఫిట్స్ అందిస్తూ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని వివరించారు. ప్రధాన మంత్రి మోదీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ముఖ్యమంత్రి చంద్రబాబుకు రాష్ట్ర ప్రజలు తరపున కృతజ్ఞతలు తెలిపారు.