2014-19 మధ్య చంద్రబాబు -పాలనలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఎంబీబీయస్ సీట్లలో ప్రయివేట్ కోటా లేదు జగన్ పాలనలో జీఓనెం: 107,108,133 ద్వారా ఆయన పాలనలో వచ్చిన 6 ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 50శాతం సీట్లు ప్రయివేటు కేటగిరిలో పెట్టారు కూటమి పాలనలో కూడా ఈ 50 శాతం సీట్లే పీపీపీ విధానంలో -మిగిలిన ప్రయివేటు కేటగిరీలో కొనసాగిస్తారు. 50శాతం సీట్లు అప్పుడు ఇప్పుడు ప్రభుత్వ కోటాలోనే కొనసాగుతాయి. చంద్రబాబు ప్రభుత్వం కొత్తగా చేసిన ప్రయివేటీకరణ ఏమీలేదు. జగన్ చేసిందే కొనసాగుతుంది. పైగా 10 పీపీపీ మెడికల్ కాలేజీల్లో.. జగన్ ప్రారంభించిన 5 మెడికల్ కాలేజీల్లో కన్నా అదనంగా 110 మెడికల్ సీట్లు ప్రభుత్వకోటాలో వస్తాయి మరో రెండేళ్ళల్లో అదనంగా 1750 మెడికల్ సీట్లు మన రాష్ట్ర విద్యార్థులకు వస్తాయి.
వైద్య విద్యకు ఒక్కపైసా రాష్ట్ర నిధులు ఖర్చు చేయని జగన్
జగన్ పాలనలో ప్రారంభించిన ఐదు మెడికల్ కాలేజీల నిర్మాణాల పూర్తికి రూ.2475 కోట్లు ఖర్చుచేయలి-కానీ ఖర్చు చేసింది రూ.609 కోట్లు అంటే 24 శాతం మాత్రమే ఆనాటికి ఇంకా 76 శాతం పనులు మిగిలేవున్నాయి- ఇలా అరకొర పనులు చేసి ఎన్నికల కోసం ఐదు కాలేజీలు ప్రారంబించారు – 17 కాలేజీలో ప్రారంభించినట్లు అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారు – పైగా చంద్రబాబు ఒక్క కాలేజీ కూడా ప్రారంభించలేదని నిందా ప్రచారం చేస్తున్నారు- చంద్రబాబు, ఎన్టీఆర్ పాలనలో 8 మెడికల్ కాలేజీలు ప్రారంభించారు -అనంతపురం ప్రభుత్వ మెడికల్ కాలేజీ, తిరుపతి పద్మావతి మెడికల్ కాలేజీ, నెల్లూరులో ఏసీ సుబ్బారెడ్డి ప్రభుత్వ మెడికల్ కాలేజీ, మంగళగిరిలో ఎయిమ్స్ (ఏఐఎంఎస్) లాంటివి ఇందులో ఉన్నాయి -జగన్ పాలనలో ప్రారంభించిన 5 మెడికల్ కాలేజీల నిర్మాణాలకు ఖర్చు చేసిన రూ.609 కోట్లు మొత్తం కూడ కేంద్ర నిధులే. రాష్ట్ర బడ్జెట్ నుండి రూపాయి కూడా ఖర్చు చేయకుండా అంతా తానే చేసినట్టు మోసపూరిత ప్రచారం చేస్తున్నారు.
పీపీపీ విధానం ఎందుకు?
జగన్ పాలనలో మెడికల్ కాలేజీ నిర్మాణాలకు ఏడాదికి ఖర్చు చేసింది రూ.387 కోట్లు – అవి కూడా కేంద్ర నిధులు ఈ తీరులో మిగిలి ఉన్న కాలేజీల నిర్మాణాలు పూర్తికావాలంటే 15 ఏళ్ళ పడుతుంది-మిగిలిఉన్న 1750 మెడికల్ సీట్లు మన రాష్ట్ర విద్యార్థులు పొందాలంటే ఇంకా 15 ఏళ్ళ వేచి వుండాలా? రాబోయే రెండేళ్లల్లో 1750 సీట్లు పొందాలంటే పీపీపీ విధానం తప్పని సరి అవుతుంది.
పీపీపీ విధానంలో ప్రభుత్వ కోటాలో 110 సీట్లు అదనం
-ప్రస్తుత విధానం ప్రకారం ఒక్కో ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఉన్న 150 సీట్లలో 15 శాతం జాతీయకోటాలో ఇతర రాష్ట్రాలకు పోతాయి- అంటే ఒక్కో కాలేజీలో 22 సీట్లు ఇతర రాష్ట్రాలకు పోగా 128 సీట్లు మన రాష్ట్రానికి వస్తాయి. ఈ 128 సీట్లలో జగన్ జగన్ తెచ్చిన జీఓ 107, 108, 133 ప్రకారం 64 సీట్లు ప్రయివేటు కోటా పోగా మిగిలిన 64 సీట్లు ప్రభుత్వ (కన్వీనర్) కోటాలో ఉంటాయి పీపీపీ విధానంలో అయితే ఇతర రాష్ట్రాల కోటా ఉండదు -మొత్తం 150 సీట్లు మన రాష్ట్ర విద్యార్థులకే వస్తాయి – ఇందులో ప్రభుత్వ కోటా కింద 75 సీట్లు వస్తాయి-అంటే జగన్ విధానంలో 64 సీట్లు రాగా పీపీపీ విధానంలో 75 సీట్లు వస్తాయి- దీన్ని బట్టి చూస్తే ఒక్కో కాలేజీలో ప్రభుత్వ కోటాలో 11 సీట్లు మరియు ప్రయివేటు కోటాలో మరో 11 సీట్లు అదనంగా మన రాష్ట్ర విద్యార్థులు పొందుతారు- 10 పీపీపీ మెడికల్ కాలేజీల్లో ప్రభాత్వ కోటాలో 110 సీట్లు మరియు ప్రయివేటు కోటాలో మరో 110 సీట్లు.. మొత్తం 220 సీట్లు అదనంగా మన రాష్ట్ర విద్యార్థులకు వస్తాయి.
పీపీపీ అంటే 33 ఏళ్ళ తరువాత ప్రభుత్వపరమౌతుంది.
గతంలో చంద్రబాబు ప్రభుత్వం కరెంటు కోతలు నివారించడానికి జేగురుపాడులో ఒక విద్యుత ప్లాంట్ పీపీపీ విధానంలో కేటాయించింది- ప్రస్తుతానికి 33 ఏళ్ళు పూర్తి అయినందున నేడు జేగురుపాడు విద్యుత్ ప్లాంట్ ప్రభుత్వ పరమైంది.
గతంలో జిల్లాకొక మెడికల్ కాలేజీ, రెవిన్యూడివిజన్ పరిధిలో ఒక ఇంజనీరింగ్ కాలేజీని చంద్రబాబు స్థాపించారు. అందు వల్లనే ప్రతి నలుగురు ఎన్ఆర్ఐల్లో ఒకరు తెలుగువారు వున్నారు. నేడు వైద్యుల కొరత లేక పోవడానికి ఆనాడు చంద్రబాబు ప్రయివేటులో కూడా మెడికల్ కాలేజీలు స్థాపించడమే కారణం కేవలం ప్రభుత్వరంగంపై ఆధార పడ్డ రాష్ట్రాలు నేడు డాక్టర్ల కొరతతో అవస్థలు పడుతున్నాయి. ఏపీలో నేడు 18 ప్రభుత్వ మరో 18 ప్రయివేటు కాలేజీలు ఉన్నాయి-ఈ పీపీపీ మెడికల్ కాలేజీలపై ప్రభుత్వ నియంత్రణ ఉంటుంది- ఆ ఆసుపత్రులలో ఉచిత వైద్యం, పరీక్షలు మెరుగ్గా ఉంటాయి- రాజకీయ ప్రయోజనం కోసమే జగన పీపీపీ విధానంపై దుష్ప్రచారం చేస్తున్నారు- తెలుగుదేశం పాలనలోనే వైద్యరంగం అభివృద్ధి అయ్యింది- ఈ ఏడాది బడ్జెట్లో వైద్యరంగానికి రికార్డు స్థాయిలో రూ.19 వేల కోట్లు కేటాయించారు.
జగన్ పాలనలోనే ప్రజారోగ్య విపత్తు
1. నీతి అయోగ్ ర్యాంకింగ్స్లో వైద్య, ఆరోగ్య ప్రమాణాల్లో చంద్రబాబు పాలన (2014-19)లో ఏపీ దేశంలో 4 వ స్థానంలో నిలిచింది- జగన్ పాలనలో అది 10వ స్థానానికి దిగజారింది.
2. విషపూరిత మద్యంతో 35 లక్షల మంది పేదల ఆరోగ్యాలు గుల్లయ్యాయి – అందులో 30 వేల మంది మరణించారు. ప్రభుత్వ, ప్రయివేట్ ఆసుపత్రులలో చేరిన మద్యం, డ్రగ్స్ రోగుల ఓపీ రికార్డులే ఇందుకు రుజువులు.
3. కరోనాలో 50 వేల మంది లోపే చనిపోయారని జగన్ ప్రభుత్వం చెప్పింది కాని కేంద్ర ప్రభుత్వ సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టం (సీఆర్ఎస్) ప్రకారం 2021లో ఏపీలో ఒక లక్షకు పైగా మరణాలు సంభవించాయి -పారాసిటమాల్, బ్లీచింగ్తో కరోనాను అరికట్టవచ్చని చెబుతూ జగన్ తేలిగ్గా తీసుకున్నారు. కరోనాలో మద్యం షాపులు నడపడం వల్లనే కరోనా మరణాలు అధికంగా సంభవించాయి.
4. జగన్ దిగిపోతూ ఆరోగ్యశ్రీ బకాయిలు రూ. 1600 కోట్లు పెట్టిపోయారు.
5. జగన్ పాలనలో మందులు, అంబులెన్సుల కొనుగోళ్ళులో భారీ అవినీతి జరిగింది.
6. జగన్ పాలనలో ప్రభుత్వ అసుపత్రులలో చనిపోయిన వారి పార్థివ దేహాల్ని తీసుకెళ్ళడానికి అంబులెన్సుల మాఫియాలు అడిగినంత ఇవ్వలేక మోటారు సైకిళ్ళపై శవాల్ని ఇళ్లకు తీసుకెళ్ళిన దుస్థితిని ప్రజలు చేశారు.
7. జగన్ పాలనలో గంజాయి, డ్రగ్స్ ఏ రాష్ట్రంలో పట్టుబడ్డా వాటి మూలాలు ఏపీలోనే తేలేవి -యువత మాదకద్రవ్యాల మహమ్మారికి నిర్వీర్యమైంది – 1750 మంది అత్మహత్యలకు పాల్పడ్డారు. సైకోలుగా మారి అత్యాచారాలకు ఒడిగట్టారు.
ఇలా జగన్ పాలనలో రాష్ట్రంలో ఆరోగ్య విపత్తు ఏర్పడింది.
హెల్తీ, హేపీ రాష్ట్ర నిర్మాణమే చంద్రన్న సంకల్పం.
-గురజాల మాల్యాద్రి,
చైర్మన్, టీడీపీ నాలెడ్జ్ సెంటర్