- దక్షిణ కొరియా కంపెనీలకు మంత్రుల ఆహ్వానం
- సియోల్లో కొనసాగుతున్న మంత్రులు నారాయణ,జనార్దన్ రెడ్డి పర్యటన
- కియా, లొట్టే గ్రూప్ ప్రతినిధులతో భేటీ
- విశాఖ పార్టనర్ షిప్ సమ్మిట్కు రావాలని కోరిన మంత్రులు
- సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో పారిశ్రామిక అనుకూల విధానాలను వివరించిన వైనం
- స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ను చేతల్లో చూపిస్తున్నామన్న మంత్రులు
సియోల్ (చైతన్యరథం): ఆంధ్రప్రదేశ్ లోపెట్టుబడులు పెట్టేందుకు రావాలని దక్షిణ కొరియా పెట్టుబడిదారులను మంత్రులు నారాయణ, బీసీ జనార్దన్ రెడ్డి ఆహ్వానించారు. విజనరీ లీడర్ చంద్రబాబు నాయకత్వంలో ఏపీలో స్పీడ్ ఆఫ్ డూయింగట్ బిజినెస్ నన్ను చేతల్లో చూపిస్తున్నామన్నారు. సమర్ధ నాయకత్వంతో కేవలం 15 నెలల్లోనే ఏపీకి రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షించగలిగామని తెలిపారు. ఈ ఏడాది నవంబర్ లో విశాఖపట్నంలో జరిగే సీఐఐ పార్టనర్ షిప్ సమ్మిట్కు రావాల్సిందిగా దక్షిణ కొరియా ఇన్వెస్టర్ను ఆహ్వానించారు. మూడు రోజులుగా దక్షిణ కొరియా రాజధాని సియోల్ పర్యటిస్తున్న మంత్రులు…. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలు, ప్రభుత్వం కల్పిస్తున్న సదుపా సదుపాయాలను అక్కడి పారిశ్రామిక వేత్తలకు వివరిస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం సియోల్లో కియా కార్ల పరిశ్రమ ప్రధాన కార్యాలయానికి వెళ్లిన మంత్రులు, ఇండియన్ ఎంబసీ, ఏపీ అధికారులకు కంపెనీ ప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. కియా సంస్థ స్ట్రాటజిక్ బిజినెస్ ప్లానింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్, గ్లోబల్ ఆపరేషన్స్ డివిజన్ ప్రతినిధులతో మంత్రుల బృందం సమావేశమయింది.
ఇప్పటికే అనంతపురంలోని కియా యూనిట్ కార్ల ఉత్పత్తిలో ముందంజలో ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గ్లోబల్ మార్కెట్లో కియా కార్ల అమ్మకాలు, కియా యూనిట్ల విస్తరణపై మంత్రులు, కంపెనీ ప్రతినిధుల మధ్య చర్చ జరిగింది. ఏపీలో కియా యూనిట్కు ప్రభుత్వం అందిస్తున్న సహకారం, ప్లాంట్ విస్తరణ వంటి అంశాలపై చర్చించారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలో ఏపీలో పెట్టుబడిదారులకు కల్పిస్తున్న అవకాశాలను కియా ప్రతినిధులకు మంత్రులు వివరించారు. విశాఖలో నవంబర్ లో జరిగే పెట్టుబడిదారులకు హాజరుకావాలని ఆహ్వానించారు.
లొట్టే ప్రతినిధులతో భేటీ
మధ్యాహ్నం సియోల్లో లొట్టే(శివ)సంస్థ ప్రతినిధులతో మంత్రులు భేటీ అయ్యారు. లొట్టే కార్పొరేషన్ కార్పొరేట్ డెవలప్మెంట్ టీమ్ హెడ్, మేనేజర్, గ్లోబల్ స్ట్రాటజీ డివిజన్ వైస్ ప్రెసిడెంట్తో పాటు ఇతర ప్రతినిధులతో మంత్రులు, అధికారులు సమావేశమయ్యారు. ప్రపంచవ్యాప్తంగా ఫుడ్, కెమికల్స్, ఫార్మా రంగాలలో పెట్టుబడులు పెట్టిన లొట్టే గ్రూప్ను ఏపీకి ఆహ్వానించారు. ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చే వారికోసం ఎలాంటి జాప్యం లేకుండా సింగిల్ విండో విధానంలో అనుమతులు ఇస్తూ, ప్రత్యేకంగా అధికారుల కమిటీతో వందరోజుల్లో పనులు ప్రారంభించే విధంగా చర్యలు తీసుకుంటున్న విధానాన్ని లొట్టే కార్పొరేషన్ ప్రతినిధులకు వివరించారు. సుస్థిరమైన నాయకత్వంలో పెట్టుబడులు పెట్టేందుకు రావాలని, విశాఖ భాగస్వామ్య సదస్సుకు హాజరుకావాలని ఆహ్వానించారు.
సియోల్ పర్యటనలో మంత్రులతో పాటు దక్షిణ కొరియాలోని ఇండియన్ ఎంబసీ డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్నిషి కాంత్ సింగ్, ఫస్ట్ సెక్రటరీ సంజనా ఆర్యతో పాటు పెట్టుబడులు, మౌలిక వసతుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణ బాబు, ఆర్ధిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పీయూష్ గోయల్, ఏపీఈడీబీ అధికారులు పాల్గొన్నారు.