- సమర్థ, అసమర్థ పాలనమధ్య తేడాను వివరించండి
- గత ప్రభుత్వం ట్రూఅప్ పెట్టింది.. మనం ట్రూడౌన్ తెచ్చాం
- జిఎస్టీ సంస్కరణల ఫలితాలు ప్రజలకు వివరించండి
- మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో సీఎం టెలీకాన్ఫరెన్స్
అమరావతి (చైతన్య రథం): ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని మంత్రులు,
ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీ నేతలకు ఏపీ సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. మంగళవారం సీఎం వారితో టెలికాన్ప
రెన్స్ నిర్వహించారు. “చేసిన పనులు చెబితేనే ప్రజల్లో ప్రభుత్వంపట్ల నమ్మకం పెరుగుతుంది. ప్రజలతో మమేకమే కాదు..
మంచి పేరు తెచ్చుకోవాలి. పార్టీకి ప్రజా ప్రతినిధులు, నేతలే ప్రతినిధులు. వారి వ్యవహారశైలితో పార్టీకి, ప్రభుత్వానికి
మంచి పేరు తేవాలి. గత ప్రభుత్వం ట్రూ అప్ పేరుతో విద్యుత్ ఛార్జీలను పెంచింది. కూటమి ప్రభుత్వం ట్రూడౌన్
పేరుతో తగ్గించింది. పీక్ లోడ్లో కరెంట్ కొనుగోలు చేయకుండా.. స్వాపింగ్ విధా నాన్ని అనుసరించాం. దీంతో తక్కువ ధరకు విద్యుత్ అందుబాటులోకివచ్చింది. సోలార్, విండ్ సంప్రదాయేతర ఇంధన వనరుల ఉత్పత్తిపై దృష్టిపెట్టాం. సమర్థ పాలనకు.. అసమర్థ పాలనకు ఉన్న తేడాను ప్రజలకు వివరించాలి. జీఎస్టీ సంస్కరణలతో కలిగే లాభాలను ప్రజలకు తెలపాలి. ఏపీలోని కూటమి ప్రభుత్వం ఏడాదికి రూ.33వేల కోట్లకు పైగా నిధు ల్ని పెన్షన్ల రూపంలో పంపిణీ చేస్తోంది. ఆటోడ్రైవర్ల సేవలో పథకం కింద ఆటో, క్యాబ్ డ్రైవర్లకు రూ.15 వేలు ఇవ్వను న్నాం. సూపర్ సిక్స్ – సూపర్ హిట్ దీన్ని ప్రజలకు చెప్పాలి. ఓనర్షిప్ తీసుకోవాలి. ప్రజలు మనవైపు ఉంటే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. కూటమిగా ఉన్నాం..అద్భుత విజయాన్ని కట్టబెట్టారు. అంతకుమించిన స్థాయిలో మళ్లీ విజయం దక్కేలా కూటమి పార్టీలు బలపడాలి” అని చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.