అమరావతి (చైతన్యరథం): వైరల్ ఫీవర్తో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ త్వరగా కోలుకోవాలని వైరల్ విద్య, ఐటీశాఖల మంత్రి నారా లోకేష్ ఆకాంక్షించారు. ఈ మేరకు ఎక్స్లో మంత్రి లోకేష్ పోస్ట్ చేశారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా. ఆయన త్వరగా తేరుకుని, మంచి ఆరోగ్యాన్ని పొందాలని, ఆంధ్రప్రదేశ్కు ఆయన చేస్తున్న సేవలతో మనకు స్ఫూర్తినిస్తూ ఉండాలని.. అంతేకాక ఓజీ సినిమా అఖండవిజయాన్ని అభిమానులు, శ్రేయోభిలాషులతో జరుపుకునేందుకు ఆయన వీలయినంత త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నానని మంత్రి లోకేష్ ఆకాంక్షించారు.