- కొత్త జిల్లాల ప్రాతిపదికన జిల్లా గ్రంథాలయాలు
- తుది దశలో మంగళగిరి మోడల్ లైబ్రరీ
- 175 నియోజకవర్గాల్లోనూ మోడల్ లైబ్రరీలు
- శాసనసభలో రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్
అమరావతి (చైతన్యరథం): అమరావతిలో రూ.150 కోట్లతో అంతర్జాతీయ ప్రమాణాలతో వరల్డ్ క్లాస్ స్టేట్ లైబ్రరీ నిర్మాణాన్ని చేపడుతున్నామని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ చెప్పారు. రాష్ట్రంలో లైబ్రరీల అభివృద్ధి, సెస్సు బకాయిలకు సంబంధించి ఎమ్మెల్యేలు మండలి బుద్ధ ప్రసాద్, పల్లె సింధూర రెడ్డి, గణబాబు సోమవారం శాసనసభలో అడిగిన ప్రశ్నలకు మంత్రి లోకేష్ సమాధానమిస్తూ… సెంట్రల్ లైబ్రరీ నిర్మాణాన్ని 24నెలల్లో పూర్తి చేసేందుకు చర్యలు చేపడతామన్నారు. రాష్ట్రంలో లైబ్రరీలకు సంబంధించి మౌలిక వసతులతోపాటు మ్యాన్యుస్క్రిప్టు కాపాడేందుకు చర్యలు తీసుకుంటున్నాం. రాష్ట్రంలో గ్రంథాలయాల అభివృద్ధికి శోభా డెవలపర్స్ అనే సంస్థ రూ.100 కోట్ల విరాళం ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. దాతల సహకారాన్ని కూడా తీసుకుని గ్రంథాలయాలను అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటాం. విశాఖపట్నంలో రూ.20 కోట్లతో మోడల్ లైబ్రరీ నిర్మాణానికి చర్యలు చేపడుతున్నాం. పిల్లల్లో పఠనాసక్తి పెంచే అంశాన్ని సీరియస్గా తీసుకొని రాబోయే ఆరునెలల్లో మార్పులు తెచ్చేందుకు నిర్మాణాత్మక చర్యలు చేపడుతున్నాం. గ్రంథాలయాల్లో కమ్యూనిటీ కార్యక్రమాలు నిర్వహించే అంశాన్ని పరిశీలిస్తున్నాం. ఇందుకోసం కార్టూనిస్టులతో కూడా చర్యలు జరిపాం. మంగళగిరి నియోజకవర్గంలో మోడల్ లైబ్రరీ నిర్మాణం చివరిదశలో ఉంది, ఈ లైబ్రరీని అక్టోబర్ నెలలో ప్రారంభిస్తాం. రాష్ట్రవ్యాప్తంగా 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మోడల్ లైబ్రరీల నిర్మాణాలను చేపడతాం. ప్రస్తుతం 13 మాత్రమే జిల్లా గ్రంథాలయాలు ఉన్నాయి, కొత్త జిల్లాల ప్రాతిపాదికన 26 జిల్లా గ్రంథాలయాలను ఏర్పాటుచేస్తాం. ఇందుకు సంబంధించిన ఫైలు ఆర్థికశాఖలో ఉంది. గ్రంథాలయ సెస్సు బకాయిలకు ລ້ 2022-235 40, 2023-24లో 45శాతం, ప్రస్తుతం సంవత్సరం 52శాతం మాత్రమే వసూలయ్యాయి. పంచాయితీరాజ్, మున్సిపల్ శాఖల మంత్రులను సంప్రదించి బకాయిలు వసూలు చేసేందుకు చర్యలు తీసుకుంటాం. గ్రంథాలయాల్లో కాంపిటీటివ్స్ ఎగ్జామ్స్క సంబంధించిన అన్నిరకాల పుస్తకాలను అందుబాటులోకి తెస్తాం. ముఖ్యమంత్రి చంద్రబాబు సూచనల మేరకు డిజిటల్ లైబ్రరీలపై దృష్టి సారించాం. ఇందుకు సంబంధించి ప్రత్యేకంగా రూపొందించిన యాప్ను వందరోజుల్లో ఆవిష్కరిస్తాం. సభ్యుల సూచనలతో దేశానికే మోడల్ గా గ్రంథాలయాలను అభివృద్ధి చేస్తామని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు.