అమరావతి(చైతన్యరథం): రాష్ట్రంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్పై నిషేధం ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో అది సరిగా అమలు జరగడం లేదని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. అన్నారు. శాసనసభలో శుక్రవారం ప్లాస్టిక్ నిషేధంపై గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్లా మాదవి ప్రశ్నకు పవన్ సమాధానం ఇచ్చారు. ఒకసారి వాడి పడేసే ప్లాస్టిక్ వల్ల పర్యావరణానికి చాలా నష్టం జరుగుతోంది. అసెంబ్లీలో కూడా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం అమలు జరగడంలేదు. ఫ్లెక్సీలను కూడా నిషేదించాలి. కానీ.. చాలామంది ఉపాధికోల్పోతారని ఆలోచిస్తున్నాం. బయో డీగ్రేడబుల్ ఫ్లెక్సీలు ఏర్పాటుచేయాలని సూచిస్తు న్నాం. ప్లాస్టిక్ నిషేధంపై రాష్ట్రవ్యాప్తంగా ప్రజలకు అవ గాహన కల్పిస్తాం. అసెంబ్లీలో ఈఅంశంపై పూర్తిస్థాయి చర్చ జరగాలి. గత ప్రభుత్వం కాలుష్య నియంత్రణ బోర్డు (పీసీబీ)లో ఎవరినీ నియమించలేదు. కాలుష్య నియంత్రణ అనేది స్థానిక సంస్థలతో సంబంధమున్న అంశం. పీసీబీలో ప్రత్యేకంగా ఉద్యోగులులేరు. కాలుష్య నియంత్రణ బాధ్యత పరిశ్రమలదే కాదు.. ప్రజలు, అధికారులది కూడా. విశాఖ ఫార్మాసెజ్లో రాంకీ సంస్థకు షోకాజ్ నోటీసులు ఇచ్చి చర్యలు తీసుకున్నాం. వెంటనే చర్యలు తీసుకుంటే చాలా కుటుంబాలు రోడ్డున పడతాయి.. రాంకీపై నిర్ణయం తీసుకుంటే గత ప్రభుత్వంలా కక్ష సాధింపు అనే ప్రచారం జరిగే ప్రమాదముంది. పారిశ్రామికవేత్తలను భయపెట్టడం మా ఉద్దేశం కాదు.. కూర్చోబెట్టి సమస్యను చెబుతాం. గతం ప్రభుత్వంలా ఇప్పుడు జరగదని పవన్ అన్నారు.