అమరావతి (చైతన్య రథం): విధ్వంస పార్టీలు బెదిరింపులకు దిగినంత మాత్రాన రాష్ట్రాభివృద్ధికి చేపట్టిన సంస్కరణలు ఆపేదిలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు పరోక్షంగా వైసీపీని హెచ్చరించారు. రాష్ట్రంలో నీటి సమర్థ నిర్వహణ అంశంపై శుక్రవారం అసెంబ్లీలో చర్చ జరిగింది. చర్చలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమాధానమిస్తూ.. రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్టులకు కూటమి ప్రభుత్వం ఇప్పటివరకు ఏం చేసిందో వివరించారు. అందులో భాగంగానే -రాష్ట్రలోని మొత్తం ఇరిగేషన్ వ్యవస్థను అసమర్థ విధానాలతో గత పాలకులు ఏవిధంగానాశనం చేశారో వీడియోని ప్రదర్శించి మరీ వివరించారు. వైసీపీ వైఖరిని తూర్పారబడుతూనే.. మెడి కల్ కాలేజీలపైనా చంద్రబాబు ప్రస్తావిం చారు. “మెడికల్ కాలేజీలపై కూటమి తీసుకున్న నిర్ణయంవల్ల ఎవరికీ నష్టం జరగదు. గతంలో మెడికల్ కాలేజీలు పెట్టి పేమెంట్ కోటా పెట్టారు. ప్రభుత్వంలో మేనేజ్మెంట్ అన్నారు. పీపీపీకి ఇస్తే సమర్ధవంతంగా సేవలు అందుతాయి. అన్ని సీట్లు ఉంటాయి. నాణ్యత ఉంటుంది. పేదలకూ ఉచిత సేవలు అందుతాయి.
హైవేలను పీపీపీ విధానంలో నిర్మించారు. అలాగని ఆ హైవేలను నిర్మించిన వారికి ఇచ్చేసి నట్టా…? ఆ ఆస్తి ప్రభుత్వానిదే. ప్రభు త్వమే వాటి యజమాని. నిర్మాణం చేపట్టి… రోడ్లను నిర్వహించి.. గడువు ముగిసిన తర్వాత ప్రభుత్వానికి అప్పగి స్తారు. మెడికల్ కళాశాలల విషయంలో దూరదృష్టితో ఆలోచించే నిర్ణయం తీసుకున్నాం. ఎవరు అడ్డంపడినా మంచి నిర్ణయాలను ఆపేది లేదు” అని ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్ఘాటించారు.