- 27 అంశాలపై చర్చకు నిర్ణయం
- స్పీకర్ అధ్యక్షతన బీఏసీలో నిర్ణయం
- జీరో అవర్‌లోనూ మంతులుండాలన్న సీఎం
అమరావతి (చైతన్య రథం): ఏపీ అసెంబ్లీ సమావేశాలు 8 రోజులపాటు నిర్వహించనున్నారు. గురువారం ఉదయం సభాపతి అయ్యన్నపాత్రుడి అధ్యక్షతన జరిగిన బీఏసీ సమావేశంలో పది రోజులపాటు నిర్వహించాలని నిర్ణయించినా.. తొలిరోజు సభ అనంతరం 8 రోజులకు కుదిస్తూ నిర్ణయించారు. అంటే, బీఏసీ సమావేశంలో ఈనెల 30 వరకు అసెంబ్లీ సమావేశాలు జరపాలని నిర్ణయించినా.. తాజా నిర్ణయంతో ఈనెల 27తో వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు ముగియనున్నాయి. రోజూ ఉదయం 10నుంచి సాయంత్రం 5 గంటల వరకు సభ జరపాలని నిర్ణయించారు. సభలో చర్చించేందుకు 18 అంశాలను తెదేపా, 9 అంశాలను భాజపా ప్రతిపాదించింది. ప్రశ్నోత్తరాలతోపాటు శూన్య గంటలోనూ మంత్రులు ఉండాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. జీఎస్టీ సంస్కరణలపై గురువారం శాసనసభలో చర్చ జరిగింది. 19న జలవనరుల అంశం, 22న శాంతి భద్రతలు, 23న వైద్యారోగ్యం, 24న పరిశ్రమలు, 25న సూపర్-6, 26న క్వాంటం వ్యాలీ, 27న లాజిస్టిక్స్, 29న స్వర్ణాంధ్ర దిశగా ఏపీ, 30న రాయలసీమ- కోస్తా- ఉత్తరాంధ్ర అభివృద్ధి అంశంపై చర్చ జరగనుంది.