అమరావతి (చైతన్యరథం): కర్నూలు కవ్వాడి వీధిలో ప్రైవేటు పాఠశాల గోడ కూలి ఒకటో తరగతి విద్యార్థి రాఖీబ్(5) మృతి చెందడం పట్ల విద్య, ఐటీశాఖల మంత్రి నారా లోకేష్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటన తనను ఎంతగానో కలచి వేసిందన్నారు. ఈ ఘటనలో గాయపడిన విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాల్సిందిగా కర్నూలు జిల్లా అధికారులను ఆదేశించామన్నారు. ప్రైవేటు స్కూళ్ళలో భద్రతా ప్రమాణాల విషయంలో నిబంధనలు కచ్చితంగా పాటించాలని స్పష్టం చేశామన్నారు. మృతి చెందిన విద్యార్థి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.