- ఖాట్మండు నుంచి విశాఖకు ప్రత్యేక విమానం
- అధికారులకు మంత్రి నారా లోకేష్ ఆదేశం
- ఆర్టీజీఎస్ కేంద్రాన్ని సందర్శించి సీఎస్ఈ సమీక్ష
- నేపాల్లో చిక్కుకున్న తెలుగువారితో వీడియో కాల్
- ఏపీ భవన్, విదేశాంగ అధికారులతో సమన్వయం
- ప్రత్యేక కాల్ సెంటర్, ఏపీ భవన్ లో హెల్ప్ లైన్
అమరావతి: నేపాల్లో చిక్కుకున్న ఏపీ వాసులను సురక్షితంగా రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు మంత్రి నారా లోకేష్ చర్యలు చేపట్టా రు. సచివాలయంలో ఆర్టీజీఎస్ సెంటర్ కు సీఎస్ విజయానంద్ తో సందర్శించి అధికారులతో సమీక్ష నిర్వహించారు. హెూం మంత్రి వంగలపూడి అనిత పాల్గొన్నారు. నేపాల్లో చిక్కుకున్న తెలుగు ప్రజల సమాచారాన్ని అధికారులు లోకేష్కు వివరించారు. పలు వురు బాధితులతో మంత్రి వీడియో కాల్లో మాట్లాడారు. వారు అక్కడి పరిస్థితిని లోకేష్కు వివరించారు. నేపాల్లో చిక్కుకున్న తెలుగువారిని సురక్షితంగా వెనక్కి తీసుకరావడమే ఏకైక అజెండా అని, ఈ మేరకు అధికారులు సమన్వయంతో వ్యవహరించి అవస రమైన చర్యలు యుద్ధప్రాతిపదికన చేపట్టాలని మంత్రి ఆదేశిం చారు. నేపాల్లో చిక్కుకున్న తెలుగువారు రాష్ట్రంలోని ఏయే ప్రాంతాలకు చెందిన వారు, వారి సమగ్ర వివరాలతో కూడిన సమాచారాన్ని సిద్ధం చేయాలని ఆదేశించారు. ప్రత్యేక కాల్ సెంట ర్, వాట్సాప్ నెంబర్లను అందుబాటులో ఉంచాలని, కలెక్టర్ల ద్వారా పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని ఆదేశించారు.
ఖాట్మండు నుంచి విశాఖకు ప్రత్యేక విమానం
నేపాల్లోని వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన తెలుగు వారిని సురక్షితంగా తీసుకువచ్చేందుకు ఏపీ భవన్ అధికారి శ్రీకాంత్, రాష్ట్రానికి చెందిన సీనియర్ అధికారులు కార్తికేయ మిశ్రా, ముకేష్కుమార్ మీనా, కోన శశిధర్, అజయ్ చైన్, హిమాన్లు కుడా, జయలక్ష్మితో మంత్రి సమీక్షించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం సుమారు 240 మంది తెలుగు వారు నేపాల్ బిక్కుకున్నట్లు అధికారులు మంత్రికి తెలిపారు. నేపాల్ రాజధాని ఖాట్మండు విమానాశ్రయానికి సమీపంలోనే 165 మంది తెలుగు వారు ఉన్నారని తెలిపారు. గౌ శాలలో 90 మంది, పశుపతి నగరంలో 55 బపాల్లో 27, సిమిటికోట్ 12 మంది ఇతర ప్రాంతాల్లో మరికొంతమంది ఉన్నట్లు వెల్లడించారు. ఖాట్మండు నుంచి విశాఖకు ప్రత్యేక విమానం ఏర్పాటు చేసి వారిని రాష్ట్రానికి రప్పించాలని ఆదేశించారు. పత్రాలు పోగొట్టుకున్న వారికి తాత్కా లిక పాస్పోర్టులు జారీ చేయడం, ఖాట్మండు విమానాశ్రయం తిరిగి తెరిచిన తర్వాత విశాఖపట్నం లేదా విజయవాడకు విమానాలను ఏర్పాటు చేయడం, అవసరమైతే లక్నో, వారణాసి ద్వారా సరిహద్దు క్రాసింగ్లను ఉపయోగించడం వంటి చర్యలకు సిద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టర్ల సమన్వయంతో సురక్షితంగా వారి జిల్లాలకు స్వస్థలాలకు తిరిగి పంపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించినట్లు చెప్పారు. ప్రతి నిమిషం పర్యవేక్షిస్తున్నామని, ప్రతి తెలుగు వ్యక్తిని తిరిగి తీసుకురావడం తమ బాధ్యత అని స్పష్టం చేశారు. బాధితులకు తక్షణ సాయం, తరలింపుపై అధికారులకు బాధ్యతలు అప్పగిం చారు. ప్రతి 2 గంటలకు బాధితుల క్షేమ సమాచారం తెలుసు కోవాలని స్పష్టం చేశారు. సాధ్యమైనంత త్వరగా ఏపీ వాసు లు రాష్ట్రానికి చేరుకునేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విదేశాంగ శాఖ అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపు తున్నామని రాష్ట్ర అధికారులు మంత్రికి వివరించారు.
బాధితులతో వీడియో కాల్
మరోవైపు నేపాల్లో చిక్కుకున్న పలువురు తెలుగు వారితో మంత్రి వీడియోకాల్లో మాట్లాడారు. మహిళలు సూర్యప్రభ, రోజారాణి అక్కడి పరిస్థితులను మంత్రికి వివరించారు. ముక్తినాథ్ దర్శనానికి వెళ్లి చిక్కుకున్నా మని విశాఖకు చెందిన సూర్యప్రభ తెలిపారు.
హెూటల్ గది నుంచి బయటకు రావొద్దని.. ప్రతి 2 గంటలకు ఓసారి అధికారులు సంప్రదింపులు చేస్తారని లోకేశ్ సూచించారు. మంగళగిరికి చెందిన మాచర్ల హేమసుందర్ రావు, గ్రామర్ల నాగలక్ష్మితో మంత్రి మాట్లాడాడు. మంగళవారం తాము ప్రయాణిస్తున్న వాహనంపై ఆందోళనకారులు దాడి చేశారని బాధితులు తెలిపారు. ప్రస్తుతం పశుపతి ఫ్రంట్ హెూటల్లో తమతో పాటు 50 మంది తెలుగువారు ఉన్నట్లు మంగళగిరి వాసు లు లోకేష్కు వివరించారు. ఖాట్మండు ఎయిర్పోర్టుకు కిలోమీటరు దూరంలో తమ హెూటల్ ఉందన్నారు. ఆందోళన చెందవద్దని.. క్షేమంగా రాష్ట్రానికి తీసుకొస్తామని మంత్రి ధరోసా ఇచ్చారు. ఆహారం, నీరు, ఇతర సౌకర్యాలు అందుతున్నాయా అని బాధితులను వాక బు చేశారు. మంగళగిరి వాసులతో రాష్ట్ర వైద్య, మౌలిక సదుపా యాల సంస్థ ఛైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు టచ్లో ఉంటారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం సహకారంతో సురక్షితంగా రాష్ట్రానికి తీసుకొస్తామని బాధితులకు లోకేష్ భరోసా ఇచ్చారు.
ఆర్టీజీఎస్ కాల్ సెంటర్, ఏపీ భవన్ లో హెల్ప్ లైన్
-నేపాల్లో ప్రస్తుత పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, అక్కడి భారతీయుల సహాయార్థం భారత రాయబార కార్యాలయం (ఖాట్మండు): ప్లస్977 980 860 2881/5977-981 032 6134 సాధారణ కాల్స్తో పాటు వాట్సాప్లో కూడా సంప్రదించవచ్చని తెలిపారు. అలాగే ఏపీకి చెందిన వారు నేపాల్లో చిక్కుకుపోయి ఏదైనా అత్యవసర సహాయం లేదా ఇబ్బం దులు ఉంటే ఢిల్లీలోని ఏపీ భవన్: ప్లస్91 9818395787ను ఏర్పాటు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీజీఎస్(రియల్ టైమ్ గవర్నెన్స్) ຜ ລ້ 5 ລ້໖: 08632381000, ఎక్స్టెన్సన్ నెంబరు 8001, 8005కు ఫోన్ చేసి వివరాలు తెలు సుకోవాలని ప్రభుత్వం సూచించింది. ఏపీఎస్ఆర్టీఎస్ 24/7 హెల్ప్న్ నెంబర్లు ఇచ్చింది. 0863 2340678, : 5918500027678, ఈ మెయిల్: helpline @apnrts.com, info@ apnrts.com ৯ సంప్రదించవచ్చని సూచించింది.