- నేపాల్లో తెలుగువారిని రప్పించేందుకు ఏర్పాట్లు
- తొలివిడతగా బీహార్ బోర్డరు 22 మంది
- ఖాట్మండుకు ఏపీ నుంచి ప్రత్యేక విమానాలు
- నేడు రాష్ట్రానికి తీసుకువచ్చేందుకు చర్యలు
అమరావతి(చైతన్యరథం): నేపాల్లో చిక్కుకున్న తెలుగు పౌరులను తరలించేందుకు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఉదయం నుంచి చేసిన ప్రయత్నాలు ఫలించాయి. నేపా ల్లోని 12 ప్రదేశాల్లో చిక్కుకున్న 217 మందిని సురక్షితంగా రాష్ట్రానికి తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. తొలివిడతగా నేపాల్ లోని హెటౌడా నుంచి 22 మంది తెలుగుపౌరులను సురక్షితంగా బీహార్ బార్డర్కు తరలించేందుకు ఏర్పాట్లు చేశా రు. మిలటరీ సాయంతో హెటౌడా నుంచి 58 కి.మీ దూరంలో ఉన్న బీహార్ బోర్డర్ మోతిహరికి తెలుగుపౌరులు బయలుదేరా రు. అక్కడి నుంచి రాష్ట్రానికి తరలించేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. నేపాల్లో చిక్కుకున్న 217 మందిలో 118 మంది మహిళలు, 99 మంది పురుషులు ఉన్నారు. విశాఖపట్నం వాసులు 42 మంది, విజయనగరం 34 మంది, కర్నూలుకు చెందిన వారు 22 మంది కాగా, మిగిలిన వారు ఇతర జిల్లాలకు చెందిన వారు. తమను క్షేమంగా తరలిస్తున్న మంత్రి లోకేష్కు వారు కృతజ్ఞతలు తెలిపారు. నేపాల్లో చిక్కుకున్న 217 మంది తెలుగు పౌరుల్లో 173 మంది ఖాట్మండు పరిసరాల్లోని హెూటళ్లలో తలదాచుకున్నారు. 22 మంది హెటౌడాలో (ప్రస్తుతం వీరు మిలటరీ సాయంతో బయలుదేరారు), 10 మంది ఖాఖ్మండుకు సమీపం లోని పోఖ్రాలో, 12 మంది సిమికోట్ ఉన్నారు.
రేపు ఖాట్మండు నుంచి ప్రత్యేక విమానం
ఖాట్మండు పరిసరాల్లో ఉన్న 173 మందిని తరలించేందుకు ఇండిగో-360 విమానం గురువారం ఉదయం 10 గంటలకు ఢిల్లీ నుంచి ఖాట్మండు చేరుకుంటుంది. ఖాట్మండులో రేపు కర్ఫ్యూ సడలించిన వెంటనే వీరందరినీ విశాఖపట్నం, విజయ వాడ తరలించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశారు. ఏపీ భవన్ అధికారులు ఖాట్మండులోని తెలుగుపౌరులతో నిరంతరం సంప్ర దింపులు కొనసాగిస్తున్నారు. తెలుగుపౌరుల జాబితాను తయారు చేసి బోర్డింగ్ పాసులను సిద్ధం చేస్తున్నారు. నేపాల్ సైన్యంతో సమన్వయం చేసుకుని గురువారం ఉదయం హోటళ్ల నుంచి తెలుగు పౌరులను విమానాశ్రయానికి తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. సిమికోట్లో చిక్కుకున్న 12 మంది పౌరు లను బుద్ధ ఎయిర్ విమా నంలో ఉదయం 9 గంటలకు యూపీ సరిహద్దుల్లోని నేపాల్ గంజ్కి తరలించేందుకు ఏర్పాట్లు చేశా రు. ఒకవేళ విమానంలో తరలింపు సాధ్యం కాకపోతే హెలి కాప్టర్లను కూడా సిద్ధంగా ఉంచారు. పోఖ్రాలోని 10 మందిని 14 సీటర్ చార్టర్డ్ విమానం ద్వారా నేపాల్ గంజ్ తరలించేం దుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఇందుకు నేపాల్ వైమానిక దళ అనుమతి కావాల్సి ఉంది. ఇందు కోసం సంప్రదింపు లు చేస్తున్నారు. నేపాల్ గంజ్ చేరాక వారందరినీ రోడ్డుమార్గం ద్వారా లక్నోకి తరలించేందుకు ఉత్తరప్రదేశ్ అధికారులతో సమన్వయం చేస్తున్నారు.