అమరావతి (చైతన్యరథం): ఎంతో ఓర్పుతో పాఠాలు చెబుతూ.. విద్యార్థులను ఉన్నత స్థాయిలో నిలిపే ప్రతి గురువు దైవంతో సమానం అని విద్య, ఐటీశాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. మన సమాజంలో గురువుకు విశిష్ట స్థానం ఉంది. తల్లిదండ్రులు తర్వాత గురువును పూజిస్తాం. ఉపాధ్యాయ వృత్తికే వన్నెతెచ్చిన మహనీయుడు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా దేశానికి వారు చేసిన సేవలను స్మరించుకుంటూ గురువులందరికీ మంత్రి లోకేష్ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.










