- ఎంపీసీ, బైపీసీ కోర్సులు చదవడానికి అనుమతి
- మంత్రి చొరవతో జీఓ విడుదల
అమరావతి(చైతన్యరథం): దృష్టిలోపం దివ్యాంగ విద్యార్థుల భవిష్యత్తుకు అడ్డుకాకూడదనే ఉద్దేశంతో వారికి మిగిలిన విద్యార్థుల తో సమానంగా అవకాశాలు కల్పించడానికి మంత్రి నారా లోకేష్ ప్రత్యేకంగా చొరవ చూపారు. దృష్టిలోపం గల దివ్యాంగ విద్యార్థు లకు ఈ విద్యా సంవత్సరం నుంచి ఇంటర్మీడియట్లో ఎంపీసీ, బైపిసి కోర్సులు చదవడానికి అవకాశం కల్పించాలని నిర్ణయిం చారు. ఈ మేరకు కళాశాల విద్యాశాఖ జీఓ 278 జారీ చేసింది. తమకు సైన్స్ కోర్సుల్లో అవకాశం కల్పించాలని దృష్టిలోపం గల విద్యార్థులు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేష్కు ఇటీవల విన్నవించారు.
దివ్యాంగుల మనోభావాలను తెలుసుకున్న లోకేష్వారి విన్నపాన్ని పరిశీలించాల్సిందిగా విద్యాశాఖ అధికారులను ఆదేశిం చారు. ప్రాక్టికల్స్ పరీక్షలకు ఆ విద్యార్థులు హాజరు కావడం కష్ట మని అధి కారులు తెలిపారు. అందుకు ప్రత్యామ్నాయంగా వారికి లఘురూప ప్రశ్నలు ఇచ్చి ఎసెస్మెంట్ చేయాల్సిందిగా మంత్రి లోకేష్ సూచించారు. ఈమేరకు విధివిధానాలతో జీఓ విడుదలైంది. తమ మనోభావాలను గౌరవించి సైన్స్ కోర్సుల్లో అవకాశం కల్పిం చిన మంత్రి లోకేష్కు దృష్టి లోపం గల దివ్యాంగులు కృతజ్ఞతలు తెలిపారు. గతంలో ఐఐటిల్లో ప్రవేశానికి దివ్యాంగ విద్యార్థులకు సమస్య తలెత్తినపుడు మంత్రి లోకేష్ చొరవ చూపి ప్రత్యేక జీఓ విడుదల చేయించిన విషయం తెలిసిందే.