చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Home ఆంధ్రప్రదేశ్

తెలుగుజాతి వెలుగు దీపం!

శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రి నారా లోకేశ్‌ పిలుపు

by చైతన్యరధం
September 4, 2025
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
తెలుగుజాతి వెలుగు దీపం!
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • ప్రాణత్యాగంతో తెలుగువారికి దారిచూపిన మహనీయుడు శ్రీరాములు
  • పొట్టి శ్రీరాములు స్మృతివనం ఏర్పాటుకు అన్ని విధాలా సహకరిస్తా
  • విగ్రహం ఏర్పాటు కమిట్‌మెంటే కాదు, నాకో ఎమోషన్‌ కూడా
  • విద్యార్థులు ఆయనను స్ఫూర్తిగా తీసుకుని అనుకున్నది సాధించాలి
  • అమరావతిలో కాంస్య విగ్రహం, స్మృతివనం, ఆడిటోరియం నిర్మాణం
  • శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రి నారా లోకేశ్‌ పిలుపు

అమరావతి (చైతన్య రథం): తన ప్రాణత్యాగంతో కోట్లాది తెలుగువారికి దారిచూపిన వ్యక్తి పొట్టి శ్రీరాములని, అలాంటి మహనీయుని పేరిట స్మృతివనం ఏర్పాటుకు అన్ని విధాలా సహకరిస్తానని విద్య, ఐటీ మంత్రి నారా లోకేశ్‌ పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం, అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్‌ ట్రస్ట్‌ సంయుక్త ఆధ్వర్యంలో అమరావతిలోని తుళ్లూరు-పెదపరిమి మధ్య ప్రభుత్వం కేటాయించిన 6.8 ఎకరాల విస్తీర్ణంలో 58 అడుగుల పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహంతోపాటు ఆడిటోరియం, స్మృతివనం నిర్మాణానికి మంత్రి నారా లోకేశ్‌ శంకుస్థాపన చేశారు. అనంతరం అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళి అర్పించారు. కార్యక్రమంలో జ్యోతి ప్రజ్వలన చేసి.. పొట్టి శ్రీరాములుపై రూపొందించిన ఏవీని వీక్షించారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో మంత్రి లోకేష్‌ మాట్లాడుతూ.. ‘వాసవీమాతాకి జై. మహాత్మాగాంధీ దేశానికి స్వాతంత్య్రం సాధిస్తే.. పొట్టి శ్రీరాములు తెలుగుజాతికి గుర్తింపు సాధించిన వ్యక్తి. గాంధీని ఫాదర్‌ ఆఫ్‌ నేషన్‌ అంటే.. పొట్టి శ్రీరాములుని ఫాదర్‌ ఆఫ్‌ లింగ్విస్టిక్‌ స్టేట్స్‌ అంటారు. కొన్ని దీపాలు వెలుగునిస్తాయి. కొన్ని దీపాలు దారి చూపిస్తాయి. ప్రాణత్యాగంతో కోట్లాది తెలుగు ప్రజలకు దారి చూపించిన దీపం పొట్టి శ్రీరాములు. ఈ రోజు ఆయన 58 అడుగుల విగ్రహం ఏర్పాటుకు శంకుస్థాపన చేసుకున్నాం. విగ్రహంతోపాటు ఆడిటోరియం, మెమోరియల్‌, మ్యూజియం, మినీ ధియేటర్‌ను 6.8 ఎకరాల్లో మన అమరావతి ప్రజా రాజధానిలో ఏర్పాటు చేసుకోనున్నాం’ అని లోకేశ్‌ వివరించారు.

ఆయన ప్రాణత్యాగంతోనే ఆంధ ఆవిర్భావం

‘‘కేవలం విగ్రహం ఏర్పాటే కాదు, ప్రాజెక్టు పూర్తిచేసే బాధ్యత తీసుకోవాలని డూండి రాకేష్‌ను కోరుతున్నా. 58 అడుగుల విగ్రహం ఎందుకని చాలామంది అనుకోవచ్చు. దీనివెనుక చరిత్ర ఉంది. పొట్టి శ్రీరాములు భాషా ప్రయుక్త రాష్ట్రం కోసం 58 రోజులపాటు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. ఆయన ప్రాణత్యాగంవల్లే ఆంధ్ర రాష్ట్రం ఆవిర్భవించింది. దీంతోపాటు నెహ్రూ ఫజల్‌ అలీ కమిషన్‌ ఏర్పాటు చేశారు. ఆ కమిషన్‌ వల్ల తమిళనాడు, కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్‌ రాష్ట్రాలు ఏర్పడ్డాయి. పొట్టి శ్రీరాములు త్యాగం వల్ల ఒక్క ఆంధ్ర రాష్ట్రమే కాదు, భాషా ప్రయుక్త రాష్ట్రాలు దేశంలో ఏర్పడ్డాయి’’ అని మంత్రి లోకేశ్‌ ఉద్ఘాటించారు.

సమాజంలో మార్పు కోసం అహర్నిశలూ పోరాడారు

‘‘పొట్టి శ్రీరాములు ఆమరణ నిరాహార దీక్షతో దేశంలోనే పెను మార్పులు సంభవించాయి. ఆయన కేవలం భాషా ప్రయుక్త రాష్ట్రాల కోసమే పోరాడలేదు. సమాజంలో మార్పు కోసం అహర్నిశలూ పోరాడారు. దళిత సోదరులు ఆలయ ప్రవేశం కోసం పోరాడారు. వివిధ సామాజిక అంశాలపై ఐదుసార్లు నిరాహార దీక్షలు చేశారు. ఆయన ఏకంగా సబర్మతి ఆశ్రమానికి వెళ్లి గాంధీ తాత దగ్గరనుంచి అహింసను ఆయుధంగా చేసుకున్నారు. పొట్టి శ్రీరాములులాంటివారు పదిమంది ఉంటే చాలు. దేశానికి స్వాతంత్య్రం ఒక్క ఏడాదిలోనే వస్తుందని గాంధీ తాత సైతం వ్యాఖ్యానించారంటే.. శ్రీరాములు నిబద్ధతను అర్థం చేసుకోవచ్చు’’ అని లోకేశ్‌ పేర్కొన్నారు.

నమ్మిన సిద్ధాంతం కోసం జీవితం త్యాగం

‘‘పొట్టి శ్రీరాములు గురించి పాఠ్యాంశాల్లో చదువుకున్నాం. కానీ ఆయన చేసిన కార్యక్రమాల వెనుక ఎంతో ఆలోచన, త్యాగం ఉందని అర్థం చేసుకోవాలి. దాన్నుంచి చాలా నేర్చుకోవాల్సి ఉంది. నమ్ముకున్న సిద్ధాంతం కోసం జీవితం త్యాగం చేశారు శ్రీరాములు. ఒక్క మార్కు తక్కువొస్తే.. విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న రోజులు చూస్తున్నాం. పొట్టి శ్రీరాములు దగ్గర నుంచి పట్టుదల, కమిట్‌మెంట్‌ నేర్చుకోవాలి. మనం ఏదైనా సాధించాలనుకుంటే తొలి అడుగు వేస్తే సమాజం మొత్తం మన వెనుక ఉంటుంది. ఇప్పుడు ప్రదర్శించిన వీడియోలో అదే చూశాం. ఆయన దీక్షకు కూర్చొన్నప్పుడు చాలామంది రాలేదు. ఎప్పుడైతే ఆయన ఆరోగ్యం క్షీణించడం మొదలుపెట్టిందో ఆంధ్ర రాష్ట్రం మొత్తం ఆయన వెనుక నిలబడిరది’’ అని లోకేశ్‌ భావోద్వేగంతో వివరించారు.

పొట్టి శ్రీరాములు స్ఫూర్తిగా అనుకున్నది సాధించాలి

‘‘ఇన్ని దశాబ్దాలైనా ఈ రోజు ఆయనను గుర్తుచేసుకుంటున్నామంటే.. ఆయన చేసిన త్యాగం వల్లే. మనం ఏ కార్యక్రమం చేసినా ఆయనను గుర్తుచేసుకోవాలి. ఆయనను స్ఫూర్తిగా తీసుకుని మనం అనుకున్నది సాధించాలి. పొట్టి శ్రీరాములు గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఆర్యవైశ్య సామాజిక వర్గంనుంచి కొణిజేటి రోశయ్య నాకు గుర్తుకువస్తారు. రోశయ్య తాత ఎప్పుడైతే గవర్నర్‌ అయ్యారో ఏడాదికోసారి ఆయనతో మాట్లాడేవాడిని. రాజకీయాల్లో మీరు లేని లోటు తెలుస్తోందని ఆయనతో చెప్పా. మిమ్మల్నిచూసి పెరిగానని, ఏవిధంగా అసెంబ్లీలో పోరాడారో.. రాజశేఖర్‌ రెడ్డికి, చంద్రబాబుకి మధ్య యుద్ధం జరుగుతుందంటే ఒక్కమాటతో దానిని చల్లబరిచేవారు. అది మీ గొప్పతనం ఇప్పటి రాజకీయాల్లో లేకుండా పోయిందని ఎన్నోసార్లు చెప్పాను’’ అంటూ లోకేశ్‌ గడచిన జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.

పొట్టి శ్రీరాములు చరిత్రపై అధ్యయనం జరగాలి

‘‘రాష్ట్రం కోసం చాలామంది పనిచేశారు. వారిని మనం గుర్తుచేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు స్మృతివనం ద్వారా మనం కేవలం వీడియోలు, ఫోటోలు మాత్రమే కాకుండా ఒక చైర్‌ కూడా ఏర్పాటుచేసి పొట్టి శ్రీరాములు సమాజానికి ఏవిధంగా పనిచేశారో, దానిపై అధ్యయనం చేయాల్సిన అవసరముంది. దానికి వేదికపై ఉన్న పెద్దల సహకారం కోరుతున్నా. ఇప్పుడు ప్రదర్శించిన వీడియోలో పెద్దగా ఫోటోలు లేవు. ఆయన ఫోటోలన్నీ సేకరించాలి. లైబ్రరీనుంచి బుక్స్‌ తీసుకువచ్చి వాటిని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. స్మృతివనం నిర్మించడమే కాదు.. ఒక చైర్‌ ఏర్పాటుచేసి ఆయన చరిత్రపై అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది’’ అని లోకేశ్‌ ప్రతిపాదించారు.

ఇది కమిట్‌మెంటే కాదు.. ఎమోషన్‌ కూడా

‘‘పాదయాత్ర చేస్తున్నప్పుడు అమరావతిలో పొట్టి శ్రీరాములు విగ్రహం ఏర్పాటు చేయాలని ఆర్యవైశ్య సోదరులు కోరారు. అప్పుడే హామీ ఇవ్వడం జరిగింది. ఇది కమిట్‌మెంట్‌ మాత్రమే కాదు.. ఇది నాకో ఎమోషన్‌. పాదయాత్రలో మిమ్మల్ని కలిసిన తర్వాతనే ఆయన గురించి తెలుసుకున్నాను. అందుకే ఒక ఎమోషన్‌తో మేం అందరం పనిచేస్తున్నాం. అన్నిరకాలుగా ట్రస్ట్‌కు మేం సహకరిస్తాం, నిలబడతాం. కలిసికట్టుగా ముందుకెళ్లి ఎవరూ ఊహించనట్టుగా అద్భుతమైన స్మృతివనం ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాను. అమర్‌ రహే పొట్టి శ్రీరాములు’’ అని లోకేశ్‌ భావోద్వేగంతో ప్రకటించారు.

ఆర్యవైశ్య కార్పొరేషన్‌ ఛైర్మన్‌ డూండి రాకేష్‌ మాట్లాడుతూ ‘‘అమరావతిలో అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహం ప్రతిష్టించాలని, ఆడిటోరియం నిర్మించాలని సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌ను కోరిన వెంటనే అంగీకరించారు. ఆ బాధ్యతను మంత్రి నారాయణ మీద వేసుకుని సీఆర్డీయే అధికారులతో మాట్లాడి స్థలం కేటాయించారు. వాసవీ కన్యాకాపరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని కోరితే సీఎంని ఒప్పించి, పెనుగొండ పంపించి పట్టువస్త్రాలు సమర్పించిన ఘనత ఎన్డీయే కూటమిది. పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహం కోసం అమరావతి నడిబొడ్డున 6.8 ఎకరాల స్థలం కేటాయించారు. రాబోయే మార్చి 16న 58 అడుగుల కాంస్య విగ్రహాన్ని మంత్రి నారా లోకేశ్‌తో ఆవిష్కరింపజేస్తామని మాట ఇస్తున్నా’’ అని ప్రకటించారు.

మంత్రి టీజీ భరత్‌ మాట్లాడుతూ… మంత్రి లోకేష్‌ గేమ్‌ చేంజర్‌. పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని ఆవిష్కరించాలని రాకేష్‌కు ఆలోచన రావడం గొప్ప విషయం. ఇందుకు ధన్యవాదాలు. మా టీజీవీ గ్రూప్‌ తరపున మొదటి విరాళం రూ.కోటి అందిస్తున్నాం. ఇతర ఏ సహకారం కావాలన్నా అందిస్తాం. గత ఎన్నికల్లో 95 శాతం ఆర్యవైశ్యులు కూటమికి ఓటేశారు. ఇతర రాష్ట్రాల్లో ఎక్కడా లేనివిధంగా నాకు కూడా మంచి శాఖ కేటాయించి గుర్తింపునిచ్చారు’’ అని ఆనందం వ్యక్తం చేశారు. మంత్రి పి నారాయణ మాట్లాడుతూ.. హరిజనుల కోసం పొట్టి శ్రీరాములు ఉద్యమాలు చేశారు. 58 రోజులపాటు నిరాహార దీక్ష చేపట్టి ఆంధ్ర రాష్ట్రం కోసం ప్రాణత్యాగానికి పాల్పడ్డారు. అలాంటి వ్యక్తికి విగ్రహం ఏర్పాటు చేయాలని లోకేశ్‌.. సీఎంకు ప్రతిపాదించగానే వెంటనే ఆదేశాలు జారీ అయ్యాయి. 6.8 ఎకరాలు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నాం. 2026 మార్చి 16 నాటికి స్మృతివనం నిర్మాణం పూర్తి చేస్తామని చెబుతున్నారు. సీఆర్డీయే తరపున అన్ని విధాల సహకారం అందిస్తా’’మని హామీ ఇచ్చారు.  అనంతరం పొట్టి శ్రీరాములు వారసులు నలుగురిని స్జేజిపైకి ఆహ్వానించి మంత్రి లోకేష్‌ వారిని శాలువాతో ఘనంగా సత్కరించారు. శంకుస్థాపన కార్యక్రమాన్ని పురస్కరించుకుని మంత్రి లోకేష్‌కు రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్‌ ఛైర్మన్‌ డూండి రాకేష్‌ పొట్టి శ్రీరాములు జ్ఞాపికను అందజేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్‌, కుడా ఛైర్మన్‌ సోమిశెట్టి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

Previous Post

ఫేక్‌ గ్యాంగ్‌ తాట తీస్తా

Next Post

బలహీన స్థానిక సంస్థలకు ఊతం

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 02-11-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 02-11-2026

November 2, 2026
ప్రజాప్రభుత్వంలో పారదర్శకంగా స్థానిక ఎన్నికలు
ఆంధ్రప్రదేశ్

ప్రజాప్రభుత్వంలో పారదర్శకంగా స్థానిక ఎన్నికలు

November 2, 2026
విద్యార్థుల్లో మానసిక ధైర్యం నింపేందుకు చర్యలు
ఆంధ్రప్రదేశ్

విద్యార్థుల్లో మానసిక ధైర్యం నింపేందుకు చర్యలు

November 2, 2026
బాలికను సొంత కూతురిలా చూసుకుంటా
ఆంధ్రప్రదేశ్

బాలికను సొంత కూతురిలా చూసుకుంటా

November 2, 2026
తుఫాన్ సహాయక చర్యలకు సన్నద్ధం
ఆంధ్రప్రదేశ్

తుఫాన్ సహాయక చర్యలకు సన్నద్ధం

November 2, 2026
బీసీలకు 40% సీట్లు
ఆంధ్రప్రదేశ్

విద్యుత్ పునరుద్ధరణ పనులకు సిబ్బందిని పంపండి

November 2, 2026
Next Post
బలహీన స్థానిక సంస్థలకు ఊతం

బలహీన స్థానిక సంస్థలకు ఊతం

ముఖ్య వార్తలు

  • ముఖ్య వార్తలు
బాలికను సొంత కూతురిలా చూసుకుంటా

బాలికను సొంత కూతురిలా చూసుకుంటా

by చైతన్యరధం
November 2, 2026
0

ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉంది మరో 48 గంటలు కీలకం...సురక్షితంగా రావాలని ప్రార్థిద్దాం విద్యార్థుల రక్షణే మా మొదటి ప్రాధాన్యం దాడులు పునరావృతం కాకుండా...

తుఫాన్ సహాయక చర్యలకు సన్నద్ధం

తుఫాన్ సహాయక చర్యలకు సన్నద్ధం

by చైతన్యరధం
November 2, 2026
0

యంత్రాంగానికి సీఎం చంద్రబాబు ఆదేశం ఉన్నతాధికారులతో ముందస్తు కార్యాచరణపై సమీక్ష నేటి ఢిల్లీ పర్యటనను రద్దు చేసుకుంటున్నట్లు వెల్లడి అమరావతి(చైతన్యరథం): రాష్ట్రానికి మరో తుఫాను ముప్పు పొంచి...

తుఫాను బాధితుల కష్టం తెలుసు…ఆదుకుంటాం

by చైతన్యరధం
October 31, 2026
0

సాధారణ స్థితికి తెచ్చేందుకు నిరంతరం శ్రమిస్తున్నాం పంటల బీమాతోనే ప్రతి రైతుకూ ధీమా డెల్టా కాలువల ఆధునికీకరణతో ముంపు తొలగిస్తాం తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు...

నేడు రాష్ట్రానికి కేంద్ర బృందాలు

నేడు రాష్ట్రానికి కేంద్ర బృందాలు

by చైతన్యరధం
October 30, 2026
0

క్షేత్రస్థాయి పరిశీలనతో వాస్తవ నష్టం అంచనా ప్రాథమికంగా రూ.4,600 కోట్ల నష్టం వాటిల్లింది ఆ నివేదికను ఇప్పటికే కేంద్రానికి కూడా పంపాం యంత్రాంగం అప్రమత్తంతో ప్రాణనష్టం తగ్గింది...

మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

ఆవిష్కరణల కేంద్రంగా ఆంధ్ర!

ఆవిష్కరణల కేంద్రంగా ఆంధ్ర!

by చైతన్యరధం
August 21, 2025
0

స్టార్టప్‌లకు ఊపిరి పోసేలా రతన్‌ టాటా ఇన్నోవేషన్‌ హబ్‌ అమరావతితోపాటు ఐదుచోట్ల ఆర్టీఐహెచ్‌ కేంద్రాలు రతన్‌ టాటా ఇన్నోవేషన్‌ హబ్‌ ప్రారంభించిన సీఎం చంద్రబాబు ఇన్నోవేషన్‌ బిజినెస్‌...

గొడ్డలి పార్టీకి దెబ్బకొట్టాలి ‘స్థానికం’లో కూటమే గెలవాలి

గొడ్డలి పార్టీకి దెబ్బకొట్టాలి ‘స్థానికం’లో కూటమే గెలవాలి

by చైతన్యరధం
October 12, 2026
0

గెలిచే అభ్యర్థులకే టికెట్లు మిత్రపక్షాలతో పక్కా సమన్వయం ఉండాలి టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఎంపీలు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలతో ప్రత్యేక టెలీకాన్ఫరెన్స్ అమరావతి (చైతన్యరథం): స్థానిక సంస్థల...

దాడులు… పిటిషన్లు… లిటిగెంట్లు…ఇదే గొడ్డలి పార్టీ నైజం

దాడులు… పిటిషన్లు… లిటిగెంట్లు…ఇదే గొడ్డలి పార్టీ నైజం

by చైతన్యరధం
October 25, 2026
0

అదే హింస...అవే అబద్ధాలు...అవే అరాచకాలు వైసీపీ పాలనలో చేసిన దారుణాలు మరిచిపోయారా? ప్రజలను భయభ్రాంతులు చేసి ఏకగ్రీవాలు చేసుకున్నారు స్వేచ్ఛగా నామినేషన్లు వేస్తూనే వ్యవస్థలను తప్పుపడుతున్నారు నేం...

గొడ్డలి పార్టీకి దెబ్బకొట్టాలి ‘స్థానికం’లో కూటమే గెలవాలి

సీట్ల సర్దుబాటుపై ఏకాభిప్రాయం

by చైతన్యరధం
October 15, 2026
0

సీఎం చంద్రబాబుతో కీలక సమావేశం రెండురోజుల్లో కూటమి అభ్యర్థులను ప్రకటిస్తామని జనసేన నాయకుల ప్రకటన అమరావతి(చైతన్యరథం): స్థానిక సంస్థల ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుకు సంబంధించి కూటమి నేతలు...

మరిన్ని

తాజా సంఘటనలు

చైతన్యరధం ఈ పేపర్ 02-11-2026

చైతన్యరధం ఈ పేపర్ 02-11-2026

by కార్యకర్త
November 2, 2026
0

ప్రజాప్రభుత్వంలో పారదర్శకంగా స్థానిక ఎన్నికలు

ప్రజాప్రభుత్వంలో పారదర్శకంగా స్థానిక ఎన్నికలు

by చైతన్యరధం
November 2, 2026
0

ప్రజాస్వామ్యం గురించి జగన్‌రెడ్డి నీతులు చెబుతున్నారు పులివెందులలో ఉద్దేశపూర్వకంగానే సమస్య సృష్టించారు నాడు ఏకగ్రీవాలు ఎలా చేశారో అందరూ ప్రశ్నించాలి ఎన్నికల కోడ్ ఉండగా ర్యాలీ ఏ...

విద్యార్థుల్లో మానసిక ధైర్యం నింపేందుకు చర్యలు

విద్యార్థుల్లో మానసిక ధైర్యం నింపేందుకు చర్యలు

by చైతన్యరధం
November 2, 2026
0

రాప్తాడు ఘటన నేపథ్యంలో కౌన్సెలింగ్ 20 మందితో ప్రత్యేక బృందం ఏర్పాటు విద్యార్థుల ఇళ్లకు వెళ్లి మానసిక ధైర్యం, భద్రతపై భరోసా కల్పించేలా లోకేష్ చర్యలు అమరావతి(చైతన్యరథం):...

బాలికను సొంత కూతురిలా చూసుకుంటా

బాలికను సొంత కూతురిలా చూసుకుంటా

by చైతన్యరధం
November 2, 2026
0

ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉంది మరో 48 గంటలు కీలకం...సురక్షితంగా రావాలని ప్రార్థిద్దాం విద్యార్థుల రక్షణే మా మొదటి ప్రాధాన్యం దాడులు పునరావృతం కాకుండా...

మరిన్ని
[mc4wp_form id="35898"]
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook X-twitter Instagram Youtube
Sanbrains

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6

© 2026 Telugu Desam Party.