అమరావతి (చైతన్యరథం): కరుణ, ప్రేమ, సేవ వంటి మానవత్వపు సహజ గుణాలు సమాజానికి ఎల్లప్పుడూ అవసరమని తన జీవితం ద్వారా తెలియజెప్పిన మహోన్నత మానవతావాది మదర్ థెరెసా జయంతి సందర్భంగా… పేదలు, రోగులు, అనాథలకు అమ్మగా అండగా నిలిచి సేవలందించిన ఆ కరుణామయి త్యాగనిరతిని స్మరించుకుందాం. ప్రజాసేవకు స్ఫూర్తిని పొందుదాం.